గౌరీ పరమేశ్వరుల జాతర సందర్భంగా సారే ఊరేగింపు అనకాపల్లి in Visakhapatnam,Vizagvision….ఉత్తరాంధ్ర ప్రఖ్యాతిగాంచిన విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల జాతర సందర్భంగా గా సుమారు వెయ్యి రకాల పిండివంటలతో మూడు వేల మంది మహిళలతో భారీ స్థాయి ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ నిర్వహించింది.ఈ సారే ఊరేగింపు కార్యక్రమాన్ని అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి , విష్ణుమూర్తి దంపతులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గుడివాడ నాగమణి గుడివాడ గౌరీ ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొణతాల సంతోష అప్పారావు నాయుడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 25వ తేదీ శనివారం నాడు గౌరీ పరమేశ్వరుల జాతర నిర్వహిస్తారు. ప్రతిఏటా జాతరకు ముందు ఆనవాయితీగా ఈ గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రకరకాల నోరూరించే పిండివంటలతో గవరపాలెం లోని ప్రతి గడప నుంచి మహిళలంతా ఇంట్లో తయారు చేసిన పిండి వంటలతో ఊరేగింపుగా వస్తుంటే చూపరులను ఆకట్టుకుంది.ఈ సారే ఊరేగింపులో అరిసెలు ,పొంగడాలు ,జిలేబీలు సున్నుండలు బూరెలు ,గారెలు ,చిలకలు గులాబీ పువ్వులు వీటితోపాటు అనకాపల్లి బెల్లం కూడా ఉంది.అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ నెల రోజుల పాటు గౌరీ పరమేశ్వరుల జాతరలు ఘనంగా నిర్వహిస్తారు .అందులో భాగంగా గౌరీ పరమేశ్వరుల సారే ఊరేగింపు కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహించడంలో గవరపాలెం ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఈ సందర్భంగా ఎమ్. పి డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యురాలిగా ఈ గౌరీ పరమేశ్వరుల సారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ నెల 25వవ తేధీన జరిగే గౌరీపరమేశ్వరుల జాతరకు అందరూ హజరు కావాలని గౌరీపరమేశ్వరులను ధర్శించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జాజుల రమేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్, కొణతాల మురళి, గొర్లి సూరిబాబు , పిలా శ్రీనివాసరావు అధిక సంఖ్యలో మహిళలు , భక్తులు పాల్గొన్నారు.

















