“కేవలం నువ్వే” పుస్తకావిష్కరణ”in Visakhapatnam,Vizagvision…
సుప్రసిద్ధ రచయిత, కవియిత్రి సుధారాణి రచించిన ‘”కేవలం నువ్వే”తెలుగు కవిత్వంలో ఆధునిక ధోరణులపై ధారావాహిక ఉపన్యాస స్రవంతి ద్వితీయ భాగం పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం ద్వారకానగర్ పౌర గ్రంధాలయం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. చెన్నైకు చెందిన నవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ పురస్కార గ్రహిత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవసాహితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఇండియాటుడే పూర్వ సంపాదకులు ఎస్వి సూర్యప్రకాశ్రావు స్వాగతోపన్యాసం చేయగా ఉత్తరాంధ్ర సాహిత్యవేత్త గంటేడ గౌరునాయుడు పుస్తక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ప్రఖ్యాత ఇంద్రజాలికులు వేముల పాటి మాధవరావు, ఏలూరుకు చెందిన ప్రముఖ గాయని శాంతి శ్రీ, కవి రచయిత సుజాత మూర్తి ఉండవల్లి తదితరులు పాల్గొన్నారు.

















