14 Victims Admitted Hospital పిచ్చికుక్క స్వైర విహారం Due to Mad dogs in Kancikacarla Nandigram,Krishna Dist,Vizagvision..
కంచికచర్లలో పిచ్చికుక్క స్వైర విహారం కంచికచర్ల ప్రభుత్వ హాస్పిటల్ కి చేరిన 14 మంది బాధితులు ….
ఓకే పిచ్చికుక్క 14 మందిని కరిచిన సంఘటన కంచికచర్ల పట్టణంలో చోటుచేసుకుంది ఈరోజు ఉదయం నుండి పలు చోట్ల అకస్మాతుగా ప్రత్యక్షమవుతున్న పిచ్చికుక్క కరిచిన వెంటనే అక్కడి నుండి పారిపోవడం మరొకచోట మరొకరిని కరవడం ఇలా మొత్తం 14 మంది ని కరవగా ఇంకా ఈ పిచ్చి కుక్క దాడి పెరిగే అవకాశం ఉంది..
కంచికచర్ల ప్రభుత్వ హాస్పిటల్ లో వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా తరచూ 6 నుండి 8 వరకు కుక్క కాటు బాధితులు వస్తున్నారని వైద్య శాఖ అధికారి తెలిపారు..
పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని కుక్కలు స్వైర విహారం చేస్తు ఇష్టం వచ్చినట్లు కరుస్తుండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…


















