విశాఖ జిల్లా అక్కయ్య పాలెం కట్ట ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ లో యువతి అనుమానాస్పద మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన జ్యోత్స్న కి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తండ్రి సింగుపల్లి దేవన్ .ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తూ భార్య మారుతి ,కుమార్తె జ్యోత్స్న ,కుమారుడు వంశీతో కలిసి ప్రకాష్ నగర్ లో జీవిస్తున్నాడు.
మృతురాలు జ్యోత్స్న నగరంలోని బుల్లయ్య కళాశాలలో బి టెక్ సివిల్స్ లో మొదటి సంవత్సరం చదువుతుంది.
బుల్లయ్య కళాశాలలో చదువుతున్న జ్యోత్స్న అక్కయ్య పాలెం లోని ఫిట్ జీ కళాశాలకు చెందిన ఓ ఫ్యాకల్టీ మాస్టర్ వద్ద విద్య నేర్చుకుంటుంది..
ప్రతి రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లిన యువతి సాయంత్రం ఓ అపార్ట్మెంట్ లో విగత జీవిగా పడివుండడంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.
ఫ్యాకల్టీ మాస్టర్ సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
















