Arrest of Bulgaria VISA Foreign ATM Cards Fraud in Visakhapatnam,Vizag Vision…టెక్నాలజీతో ఈజీగా సొమ్మును కాజేస్తున్న ఇతర దేశస్ధుడ్ని విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా అరెష్టు చేశారు. ముందుగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బల్గారియా దేశానికి చెందిన వాగ్నో అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 30 లక్షల ఇండియన్ కరెన్సీ,160 కార్డ్స్,రెండు వేల డార్లును స్వాదీనం చేసుకున్నారు. ఆన్ లైన్ ద్వారా ఇతర దేశాలకు చెందిన మనీ కార్డు వివరాలను తెలుసుకొని టెక్నాలజీ సాయంతో ఫేక్ కార్డును తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. ఈ క్రమంలో ఇతర దేశాలకు చెందిన కార్డు సమాచారంతో డూప్లికేట్ కార్డులను తయారు చేసి ఇక్కడ ఏటియం ద్వారా డ్రా చేస్తున్నట్లు డిసీపీ రవీంధ్రనాద్ బాబు తెలిపారు. ఇతనిపై పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మహేంధ్ర తెలిపారు.

















