ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ రాజకీయ ప్రత్యామ్న్యాయం ఏర్పాటు కోసం జనసేన మరియు సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు….
నందిగామ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్న మూడు పార్టీల నేతలు కార్యకర్తలు…
నందిగామ నియోజకవరంలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ లు భారీ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేయగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేసారు…..
ఇప్పటికే జనసేన సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో పలు సమస్యలపై సమర శంఖం పూరించి వాటి పరిష్కార దిశగా అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కార తీసుకువెళ్లారు….
ఈనేపద్యంలో జనసేన పార్టీకి వామపక్షాలు కలవడంతో ప్రజా సమస్యలపై మరింత పోరాట దిశగా కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు బహిరంగ సభ వేదికగా చేసుకుని అధికార ప్రతిపక్ష కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు…..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడవ ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన జనసేన సిపిఎం సిపిఐ పార్టీల కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు…
















