Araku Balloon Festival 15 Countries 20 Balloons on 18th to 20th at Araku Valley, Visakhapatnam,Vizag Vision..ఈ నెల 18 నుండి 20 వరకు మూడు రోజుల పాటు అరుకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. బుధవారం ఒక ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తో కలసి మంత్రి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది అరుకు లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించామని, అదే తరహాలో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఫెస్టివల్ లో మొత్తం 15 దేశాలకు చెందిన 20 బెలూన్ లతో టీములు పాల్గొన్నట్లు తెలిపారు. బ్రెజిల్ , స్లోవేకియా , ఇటలీ ,యూకే ,థాయిలాండ్ ,ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా 15 దేశాల ప్రతినిధులు ఈ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. Bruno clone, బేబీ కార్ హ్యాపీ చికెన్ వంటి పలు ఆకృతులతో కూడిన బెలూన్లు నీలి మేఘాలు నడుము కదులుతూ ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. ఈ బెలూన్ లలో విహరించేందుకు ఇప్పటికే సుమారు నాలుగు వేల మంది పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇటువంటి అంతర్జాతీయ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా విశాఖ పర్యాటక అందాలు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందుతాయి ఆయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిచి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనే లక్ష్యంతో గత నాలుగున్నరేళ్ల లో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫలితంగా గత ఏడాది ఒక కోటి 96 లక్షల మంది పర్యాటకులు విశాఖ జిల్లాకు రాగ, ఈ ఏడాది ఇప్పటివరకు రెండు కోట్ల 30 లక్షల మంది పర్యాటకులు జిల్లాను సందర్శించాఋ అన్నారు. ప్రత్యేకంగా పర్యాటక క్యాలెండర్ ను రూపొందించి ప్రణాళికాబద్ధంగా పలు ఈవెంట్లను అమలుపరచడం జరుగుతుందన్నారు. విశాఖ జిల్లాలో పలు బుద్ధిజం సర్క్యూట్లు ఉన్నాయని, వాటిని 20 కోట్ల అంచనా వ్యయం తో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. బౌద్ధ పర్యాటకులను పెద్ద ఎత్తున జిల్లాకు వచ్చేలా కాలచక్ర తరహాలో ఒక ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అరుకు లో ఏకో టూరిజం అభివృద్ధికి 156 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేశామన్నారు. విశాఖను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పర్యాటక పరంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను గత నాలుగున్నర ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. 2014లో 9 కోట్ల 84 లక్షల మంది పర్యాటకులు రాష్ట్రానికి రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 19 కోట్ల మంది వచ్చారని ఆయన అన్నారు.

















