విశాఖ సింహాచలం…. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో సంక్రాతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త, పూసపాటి అశోకగజపతిరాజు దంపతులు మరియు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సింహగిరిపై సంక్రాతి ఉత్సవాలను ప్రారంభించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా గాలిగోపురం ఎదుట భోగిమంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు నృత్యాలను ఏర్పాటుచేశారు. అలాగే గాలిగోపురం ఎదుట రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు సింహగిరిపై పోటెత్తారు.

















