పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో నృసింహ దీక్షల విరమణ వైభవంగా ప్రారంభమయ్యాయి. నలబై రోజుల మండలదీక్షలు చేపట్టిన అప్పన్న భక్తులు నేటితో దీక్ష పూర్తి అవడంతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి నెత్తిన పెట్టుకుని కాలిబాటన స్వామిని స్మరిస్తూ మెట్లమార్గం నుండి సింహగిరి చేరుకుంటున్నారు. స్వామి పాదాలవద్ద ఇరుముడి ఉంచి దీక్ష విరమించారు. దీంతో సింహగిరి అంతా దీక్షలుచేపట్టిన భక్తులతో కిటకిటలాడింది. దేవస్థానం అధికారులు ఇరుముడులు సమర్పించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసారు. దీక్ష విరమణ నేటితో పూర్తవడంతో స్వామివారికి మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ దీక్షలు చేపట్టే భక్తులు ప్రేతియేడాది అంతకంతకు పెరగడంతో దేవస్థానం అధికారులు స్వామివారి ప్రచారరథంతో గిరిజన ప్రాంతాల్లో ప్రచారం చేసి స్వామి విశిష్టతను తెలుపుతున్నారు. సింహగిరి అంతా హరినామ స్మరణతో మారుమ్రోగింది. ఈ ఉత్సవంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ అధికారులతో దగ్గరుండి పర్యవేక్షించారు.


















