ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీన ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆటో బంద్, 9వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జెఎసి తెలిపింది. ఈ మేరకు గురువారం నాడిక్కడ ఈ బంద్కు సంబంధించిన వాల్పోస్టర్ను జెఎసి నాయకులు బి.వెంకటేశ్, దాసరి రమేష్, వి.కిరణ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంవి యాక్ట్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహారించుకోవాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని, పెరిగిన బీమా ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

















