అకాల వర్షాలు మాత్రమే కాక స్థానికంగా ఉన్న ఒక ఫ్యాక్టరీ సంబంధించిన చెరువు నీరు కూడా గండేపల్లి రైతులను నిట్టనిలువునా ముంచేసింది…
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో గల రైతులు కౌలుకు తీసుకున్న మాగాణిలో వరి పంట పండించారు దిగుబడి ఈ సంవత్సరం బాగా వచ్చింది మాగాణి పూర్తిగా ఎండి పంట కోతకు వచ్చే సమయానికి యంత్రాలు అందుబాటులో లేక పోగా కూలీలు సైతం రాకపోవడంతో కోతలు ఆలస్యం కాగా అకాల వర్షం రావడంతో పూర్తిగా రైతుల ఆశలు అడియాశలయ్యాయి దీనికి తోడు ప్రక్కనే ఉన్న సెంటినీ బయో ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీ సంబంధించిన చెరువు నీరు సైతం రైతుల పొలాల లోకి చేరుకుని నిలిచిపోయాయి ….
రైతుల పొలాల్లో నీరు మోకాలు ఎత్తున నిలిచిపోగా పారుదల సరిగా లేకపోవడంతో పండిన పంట పూర్తిగా నీటిలోకి వాలిపోయింది నీరు బయటకు వెళ్లాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుందని ఈ లోపు పంట పూర్తిగా చేతికి అందకుండా పోతుందని నోటి వద్దకు వచ్చిన పంట చేతికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీ చెరువునందు వ్యర్థాల పాటు వర్షం నీరు చేరి చెరువు నిండడం తో చెరువు నుండి నీటిని రైతుల పొలాల వైపు మళ్లించారని ఆ నీరు పంటపొలాలలో చేరి రైతులకు కన్నీరు మిగిల్చాయని ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు …
అందరం కౌలు రైతుల మని పెట్టుబడి కూలీ కౌలు రుసుము కలుపుకొని ఎకరానికి 50 వేల రూపాయల వరకు ఖర్చు అయిందని ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టం అంచనా వేసి తమకు న్యాయం చేయవలసిందిగా గండేపల్లి రైతులు కోరుతున్నారు…

















