సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ రావు (75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. నాటకరంగంలో వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిన ఆయన స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయనకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ ఉన్నారు.
1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన వైజాగ్ ప్రసాద్.. అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్, గరీబీ హఠావో లాంటి నాటికలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్ అబ్బాయ్ సినిమా ద్వారా సినీ రంగానికి జంధ్యాల పరిచయం చేశారు కొత్త గ్యాప్ తరువాత నువ్వు నేను సినిమా తో మల్లివచ్చారు. ఆ తర్వాత, భద్ర, జై చిరంజీవ, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా తదితర చిత్రాల్లో ఆయన నటించారు.