జపాన్- భారత్ మారిటైం విన్యాసాలు జైమెక్స్ 2018కు విశాఖ మూడోసారి వేదిక కానుంది. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు జపనీస్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన నౌకలు కగ, ఇనాజుమ విశాఖలోని తూర్పు నౌకాదళానికి చేరుకున్నాయి. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు జరిగే వివిధ రకాల విన్యాసాలలో భారత్ నౌకలతో పాటు ఇవి పాల్గొంటాయి. రియర్ అడ్మిరల్ టట్షుయా పుకడా నేతృత్వంలో కగ, ఇనాజుమ నౌకలు తమ సామర్ధ్యాలను ప్రదర్శిస్తాయి. ఇవి కాకుండా సబ్ మెరైన్తో పాటు పి8ఐ హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.