ఎమ్మెల్సీ మూర్తి పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. పార్టీ ప్రారంభం నుంచి టిడిపి తోటే ఉన్న మూర్తి అంకితభావాన్ని కొనియాడారు. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఆయన నైజమని గుర్తు చేసుకున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. మూర్తి వంటి సీనియర్ ని కోల్పోవడం పార్టీకి తీవ్ర నష్టం అని అన్నారు