Raining from Tree Releases Water surprising
in Visakhapatnam,vizagvision..విశాఖలో చెట్టు నుంచి వర్షం పడుతున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కయ్యపాలెం పోర్టు క్వార్టర్స్ సమీపంలో ఒక చెట్టుపై నుంచి నీటి చుక్కలు పడుతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. మరే ప్రాంతంలో వర్షం పడకుండా కేవలం ఆ చెట్టుకింద మాత్రమే వర్షపు చినుకులు మాదిరిగా నీటి బిందువులు పడడం వింతను తలపిస్తుంది. దీంతో స్థానికులంతా ఆ చెట్టుకు మహిమలు ఉన్నాయంటూ పూజలు చేయడం ప్రారంభించారు. అటువైపుగా వెళ్లేవారు సైతం తడిగా ఉన్న ఆ ప్రాంతాన్ని గమనిస్తూ ఉన్నారు. కేవలం ఆ ఒక్క చెట్టు కింద మాత్రమే నీటి బిందువులు పడడం వెనక కారణం ఏమయి ఉంటుందోనని జనమంతా ఆలోచిస్తున్నారు