ఉద్యోగులకు కరవుభత్యం :
• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన రేట్ల ప్రకారం ఒక వాయిదా కరవు భత్యం చెల్లించే ప్రతిపాదన కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.
• గత ఏడాది 7.1.2017 నుంచి వర్తించే విధంగా చెల్లింపు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సవరించిన రేట్లతో పెన్షనర్లకు ఒక వాయిదా కరవుభత్యం చెల్లించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం.
• పార్టు టైమ్ అసిస్టెంట్లు, విలేజి రెవెన్యూ అసిస్టెంట్లకు తాత్కాలిక పెంపు (అడహాక్ ఇంక్రీజ్) ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
• డీఏ చెల్లింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మొత్తం రూ.627 కోట్ల భారం పడనుంది.
శిధిలమైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు :
• గ్రామీణ ప్రాంతాల్లో 1993-94 నుంచి 2006-07 సంవత్సరంలో సెమి పర్మనెంట్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద పొందిన ఇళ్లు శిథిలావస్థలో ఉంటే వారికి NTR రూరల్ హౌసింగ్ ప్రోగ్రాం కింద షరతులకు లోబడి ఇళ్ల కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్రవేసింది.
కొత్తగా 15 వేల గృహాల మంజూరు:
• 2018-19 సంవత్సరాలకు PMAY-NTR (U) పథకం కింద ఒక్కో గృహం రూ.3.50 లక్షల వ్యయంతో మొత్తం 15,091 గృహాల మంజూరు ప్రతిపాదనకు షరతులకు లోబడి రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మ్యారిటైమ్ బోర్డు:
• ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులను అభివృద్ధి చేయడానికి, అడ్మిన్‌స్ట్రేషన్ వ్యవహారాలు చూడటానికి ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పోర్టు డిపార్టుమెంట్ స్థానంలో కొత్తగా మ్యారిటైమ్ బోర్డును తీసుకొస్తున్నారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు బిల్, 2017ను ఉపసంహరిస్తూ దాని స్థానంలో కొత్త బిల్లు తీసుకువస్తున్నారు.
బందరు పోర్టు అభివృద్ధి :
• మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఓపెన్ మార్కెట్ నుంచి రూ.1385 కోట్ల రుణాన్ని పొందేందుకు వీలుగా గతంలో రివైజ్డ్ కన్సెషన్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను అవసరమైన సవరణ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ మధ్య 07-06-2010 తేదీన జరిగిన ఒప్పందంలో ఉప నిబంధనలను మార్చడం ద్వారా డీప్ వాటర్ పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి అవసరమైన రుణం తీసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది.
కృష్ణపట్నం పోర్టు:
• కృష్ణపట్నం పోర్టు ఎక్స్‌క్లూజీవ్ లిమిట్స్‌ను సవరించాలన్న ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన దరిమిలా కృష్ణపట్నం పోర్టు లిమిట్స్‌ను డీ నోటిఫై చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి సమ్మతిని తెలియజేసింది.
సింగపూర్-విజయవాడ విమాన సర్విసులు:
• విజయవాడ-సింగపూర్ మార్గంలో ఇండిగో సంస్థ ద్వారా వారానికి 2 రిటర్న్ ఫ్లయిట్స్ నడిపేందుకు గాను ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• విజయవాడ-పుట్టపర్తి విమాన సర్వీసులు నడిపేందుకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్. విజయవాడ-నాగార్జున సాగర్ మార్గంలో విమాన సేవలు లాభదాయకం కాదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నైన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితి:
• ఆక్వా రైతులకు యూనిట్‌కు రెండు రూపాయిలు చొప్పున విద్యుత్ టారిఫ్ రాయితీని ఏడాది పాటు ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆగస్టు 1 వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. మొత్తం 94,913 మంది రైతులు ఈ రాయితీ వల్ల ప్రయోజనం పొందనున్నారు.
• మరో ఐదేళ్లలో ఇంకా 33,569 కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సివస్తుందని అధికారుల అంచనా. ప్రస్తుతం ఆక్వా రంగంలో 50వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2017-18లో 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఈ రంగంలో జరిగిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018-19లో 2.32 మిలియన్ యూనిట్ల వాడకం వుంటుందని భావిస్తున్నారు.
IIDTఅభివృద్ధి:
• తిరుపతిలోని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్’ (IIDT)ను సెక్షన్ 8 కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనికోసం పెట్టుబడి, నిర్వహణ వ్యయం కింద రానున్న రెండేళ్లకు గాను రూ.97.95 కోట్లను మంజూరు చేయాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. IIDTని లాభాపేక్షలేని సెక్షన్ 8 కంపెనీగా నమోదు చేస్తారు. ISB తరహాలో దీన్ని తీర్చిదిద్దుతారు.
• సెక్షన్ 8 కంపెనీగా నమోదవ్వడంతో నిర్దిష్ట అధీకృత నిర్వహణా వ్యవస్థ, స్పష్టమైన విధాన నిర్ణయాలతో పారదర్శక, జవాబుదారీ సంస్థగా రూపొందుతుంది.
• తిరుపతిలో వున్న IIDTలో 2019 విద్యా సంవత్సరం నుంచి కొత్త ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెడతారు. మొత్తం 250 మంది విద్యార్ధులకు ప్రవేశాలు లభిస్తాయి. 2021 నాటికి మొత్తం 400 మంది విద్యార్ధులు పెరుగుతారని ఆశిస్తున్నారు. పేరిందిన సంస్థలు దీనికి మెంటర్‌గా వుంట