Telangana Assembly Dissolved Governor Appointed KCR as Caretaker CM,Hyderabad,Vizagvision..అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టారు.
గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం.
శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకుంటారు.
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేస్తారు.
తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం – ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్ ను కోరిన గవర్నర్ – ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్న కేసీఆర్ – తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వనున్న రాజ్ భవన్ – టీఎస్ అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ కార్యదర్శికి పంపనున్న రాజ్ భవన్ – ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం