విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలం,కొత్తపోలవరం గ్రామ సివారులో నిర్మిస్తున్న సాయి మెరైన్ ఎక్సపోర్టు లిమిటెడ్ కంపెనీ వద్ద అంటూ చుట్టిపక్కల గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు.ఈ పరిశ్రమ వలన వాతావరణ కలుషితం అవుతుందని,వేస్టు కలుషితాన్ని సముద్రంలో విడిచిపెడతారని రేవుపోలవరం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిశ్రమ వలన మా మత్యకారుల జీవనాధారం కోల్పోతామని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే పరిశ్రమ ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో అడుకోవద్దని,మాకు న్యాయం జరిగేంతవరకూ పోరాటం ఆగదని ,శాంతియుతంగా పోరాటం చేస్తామని రేవుపోలవరం గ్రామస్థులు అంటున్నారు.

















