కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది.
శరావతి నది ఉప్పొంగి ప్రవహించడంతో దేశంలోనే అతిపెద్ద జలపాతం జోగ్ నుంచి నీళ్లు కిందకు దుముకుతుంటే ఆ ప్రాంతంమంతా ఆహ్లాదకరంగా మారింది.
లింగనమక్కి డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో సముద్రమట్టానికి 250 మీటర్ల (830 అడుగుల) ఎత్తులో ఉన్న ఈ అద్భుతదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకలు భారీగా వస్తున్నారు.
ఈ రిజర్వాయర్ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత, పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారట.