ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. కాగా. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో బ్యారేజీలోకి వరద నీరు భారీగా వస్తోంది. దీంతో నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే డెల్టా కాలువకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.