Police arrested House Robbery Gang,Visakhapatnam,Vizagvision..ప్రసాంతమ్తెన ….. ప్రకృతి అందాలకు నిలయమ్తెన విశాఖ మహానగరం నేడు నేరాలకు నిలయమ్తెంది. తాజా విశాఖ లోని పలుప్రాంతాలలో సెల్ ఫోన్లు , లారీ, ఆటో , బంగారం, గేదెలు, 62kv జనరేటర్ , బస్సు , ను తస్కరించిన 18 మందిని పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి దామోదర్ మాట్లాడుతూ….
నగరంలోని దొంగతనాలను అరికట్టేందుకు నిఘాపెంచడంతో పాటు ఎక్కడికక్కడ సిసి కెమేరాలను ఏర్పాటు చేసామన్నారు. అలాగే ఎవర్తె వూరువెళ్ళేవారు, తీర్ధయాత్రలకు వెళ్ళేవారు దగ్గరలోవున్న పోలీసు స్టేషన్ కు సమాచారమిస్తే అ ఇంటికి సిసి కెమేరాలను ఎర్పాటుచెస్తామని తెలిపారు.
అలాగే ఈ మద్య కాలంలో స్తెబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయని అన్నారు.
కొంతమంది ఫోన్ లో ఓటిపి ఇచ్చి నంబరులు అడుగుతున్నారు. దీనిద్వారా మనయొక్క డాటా మొత్తం వెళ్ళిపోయి తద్వారా బ్యాంకు బ్యాలన్స్ మొత్తం ఖాళీ అవుతీందని అందువలన గుర్తుతెలియని వ్యక్తులతో మాటాలాడవద్దన్నారు.