“V-Team” 10th Anniversary Celebrations,Visakhapatnam,vizag vision….ఘనంగా వీరుమామా’స్ వీ టీం ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ 10 వ వార్షికోత్సవ సంబరాలు
ప్రముఖ ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీ అయిన వీరుమామా వీ టీం తమ 10 వ వార్షికోస్త్సవాన్ని ఈ రోజు తమ కార్యాలయంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇందులో టూరిజం డైరెక్టర్ పి స్ నాయుడు గారు ముఖ్య అతిధి గా విచ్చేసి,కేక్ కట్ చేసి మాట్లాడుతూ వీరుమామా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వీ టీం ద్వారా చేసారు అని, వారి ఈ సంస్థ తమ 10 వ సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందం గ ఉంది అన్ని తెలిపారు.ఈ 10 సంవత్సరాలలో IPL ,CCL , మహిళా దినోత్సవాలు , ప్రో కబ్బాడి లీగ్ , బే మారథాన్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఈవెంట్లు చేయడం చాలా ఆనందం గా ఉంది అన్ని అలాగే ఈ 10 సంవత్సరాలు తనను సపోర్ట్ చేసిన వైజాగ్ ప్రజలకు, మీడియా మిత్రలకు మరియు ప్రతి ఒక్కరికి రుణపడిఉంటాను అని వీ టీం సీఈఓ వీరుమామా తెలిపారు.కార్యక్రమంలో వీటీం విశాఖపట్నం మరియు హైదరాబాద్ సిబ్బంది పాల్గున్నారు.