మంత్రి గంట మరియు మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదగా వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆవిష్కరణ….వీరుమామ వి టీం ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆగష్టు 25 న గురజాడ కళాక్షేత్రం లో జరగనున్న వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ కార్యక్రమం లో వివిధ స్కూల్స్ అన్ని పాల్గుణి విజయవంతం చేయాలి అని , ఈ కార్యక్రమంలో ఆర్టి ఎటాక్ అనగా డ్రాయింగ్ పోటీలు,బూగీ థ్రిల్ అనగా డాన్స్ పోటీలు , హౌటి కౌచుర్ అనగా ఫాన్సీ డ్రెస్ పోటీలు ,స్మార్ట్ బ్రెయిన్ అనగా టాప్ స్పీకర్ పోటీలు లాంటి వినూత్న పోటీలు ఉన్నాయని వి టీం సీఈఓ వీరుమామ తెలిపారు . బాల కార్మికులనివారణ నినాదంతో ఈ కార్యక్రమం పిల్లల లోని సృజనాత్మకత పెంచే విధంగా విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని సందర్బంగా 3.5 అడుగుల అతి పెద్ద బారి ట్రోఫీ ని రాష్ట్ర విద్య శాఖా మాత్యులు శ్రీ గంట శ్రీనివాస రావు గారు మరియు మంత్రి పితాని సత్యనారాయణ గారు ఆవిష్కరించారు.పాఠశాల నుంచి ఎవరైతే పాల్గొనాలిని అనుకుంటున్నారో 9030598236 సంప్రదించాలని తెలిపారు.కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ గారు, వీ టీం బృందం పాల్గున్నారు.