ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పై ఐట్యాప్ ప్రతినిధులతో చర్చించిన మంత్రి నారా లోకేష్
ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
లక్ష ఐటీ ఉద్యోగాల కల్పన కోసం మూడు లక్షల ఉద్యోగాల పైప్ లైన్ సిద్ధం చేసుకున్నాం
దేశంలో అనేక నగరాలు,విదేశాల్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాను
కొత్త కంపెనీలను తీసుకురావడం తో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను బలోపేతం చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నాం
ఐటీ కంపెనీలకు
భూములు కేటాయించడానికి
అభ్యంతరం లేదు.కానీ ఆ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి ముందు కార్యకలాపాలు ప్రారంభించాలి అని అడుగుతున్నాం.దీని ద్వారా వారి చిత్తశుద్ధి తెలుస్తుంది
డిటిపి పాలసీ అమలుచేస్తున్నాం.దీని ద్వారా కంపెనీలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం
ఐటీ రంగం అభివృద్ధి,ఐటీ కంపెనీలకు ఉన్న సమస్యల తక్షణ పరిష్కారం కోసం
ఐటీ కంపెనీల ప్రతినిధులు,ఐటీ శాఖ అధికారులతో ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
ఐటీ రంగం అభివృద్ధి లో వేగాన్ని అందుకున్నాం
విశాఖపట్నం కి ఫ్రాంక్లిన్,ఏఎన్ఎస్ఆర్,
కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీలు వచ్చాయి