న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలొో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
రాష్ట్ర విభజనను అప్పటి యూపీఏ సర్కర్ ప్రకటించిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమెన్ చాంది చొరవతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఉమెన్ చాంది, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఉన్నారు