Jana Sena Pawan Vist to Araku Rural Areas,Vizag Vision..విశాఖపట్నం జిల్లా అరకులోయ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అరకు నియోజక వర్గ పర్యటనలో భాగంగా నలుగోవరోజు డుంబ్రిగుడా మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు, అలాగే ఆంత్రాక్స్ బాధిత కుటుంబాలను పరామర్శించారు, త్రాగునీటి సమస్య గురించి స్థానిక గిరిజనులు చెప్పగా, త్రాగునీటి గ్రావిటీ కుండీని సందర్శించి నీటి సెంపెల్స్ కలెక్ట్ చేసి యూనివర్సిటీ కి టెస్టింగ్ కి పంపిస్తానని చెప్పటం జరిగింది , స్థానిక గిరిజనులు రాగులను పవన్ కళ్యాణ్ కు బహుకరించారు, తతునంతరం డుంబ్రిగుడా మండలంలో కస్తూరి భా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్గం లని మూడు గ్రామాలలో వాహనం దిగి ఆ గ్రామ గిరిజనుల కోరిక మేరకు వారి త్రాగునీటి వనరుల వద్దకు వెళ్ళి పరిస్థితులను తెలుసుకొన్నారు. అరకు లోయ మండలం లోని బాక్సైట్ కొండలను కూడా పవన్ దర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.