ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చేపట్టిన నిరాహార దీక్ష లాంఛనంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దీక్షకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎఫ్.ఆర్.పురంలో విడిది చేసిన ప్రదేశంలో దీక్షను ప్రారంభించారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య కూర్చొంటారు. సాయంత్రం 5 గంటల వరకూ శ్రీ పవన్ కల్యాణ్ గారి దీక్ష కొనసాగుతుంది.