“Simhadri Appanna Chandanotsavam” Story,Visakhapatnam,Vizag Vision..” అక్షయ తృతీయ సింహాచలములో”
ఈ మాసం 18 వ తేదీన వైశాఖ శుక్ల తదియను అక్షయ తదియగా మన తెలుగువారు జరుపుకుంటారు. దీన్ని గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందామా?
మూడులోకాలలోనూ నృసింహునికి సాటిలేని దైవంలేడని మనకందరికీ తెలుసు కదా! అప్పన్న సేవకోసం జన్మించిన గంగధార వంటి థీర్థం లేదు. గజేంద్రుడిని రక్షించడానికి ఆ మహా విష్ణువు ఎలా వచ్చి కాపాడో, అలాగే ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి నరసింహావతారములో వచ్చి హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడు. స్వామి కొంతకాలము పుట్టలో ఉన్నాడు. చంద్రవంశపు రాజైన పురూరవ చక్రవర్తి,
ఊర్వశితో విహారయాత్రలో ఈ క్షేత్రానికి వచ్చినపుడు స్వామి స్వప్నంలో రాజుకు
కనిపించి, తాను ఒకపుట్టలో ఉన్నాను ~ నన్ను ఆరాధించమని అన్నారు. రాజు ఎంత వెతికినా స్వామి దర్శనముకాలేదు రాజుకు. మరొక రాత్రి కలలో తానొక
చోట మాధవీలత కింద ఉన్న పుట్టలోనున్నానని చెప్పగా, వైశాఖ శుధ్ధ తృతీయ
నాడు రాజు స్వామిపైఉన్న పుట్టను తొలగించగా స్వామి దర్శనమయింది. గంగాధార జలముతో అభిషేకించి పంచామృతాభిషేకము కూడా చేసినాడు. అప్పుడు స్వామి తనకోసము గంధపు పుట్టను కల్పించమని ఆదేశించినాడు.
అప్పటినుండీ అక్షయ తదియనాడే స్వామి నిజ రూప దర్శనం ఉంటుంది. స్వామి పస్చిమాభిముఖుడై వెలసిన రూపము ~ వరాహ నృసింహస్వామి ~ స్వామి యొక్క రెండు అవతారాల కలయిక రూపము. ప్రహ్లాదుని ప్రార్థన మేరకు ద్వయ
రూపములో ఆయనకు దర్శనమిచ్చినాడని కథనం.
ఈ కొండకు అప్పనికొండ అని పేరు. అప్పడంటే తండ్రి. తమిళబాష అప్ప నుంచీ అప్పన్న పుట్టింది. ఈ కొండపై 12 జలధారలు
ధారలు నిరంతరం ప్రవహిస్తాయి. వాటి మూలమెక్కడో తెలియదు. ఈ జలాన్నే
అప్పన్న సేవకుపయోగిస్తారు.
సంతానంకోరే దంపతులు ఇక్కడి కప్ప స్తంబాన్ని ఆలింగనం చేసుకుంటే
సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
చందనసేవలో పాల్గునడంతోపాటూ, గిరిప్రదక్షిణ చేయడం కూడా ఒక గొప్ప ఫలాన్ని అందిస్తుందని నమ్మకము.
ఈ సేవనే చందనసేవ అని అంటారు. ఈ చందనసేవకు చందనాన్ని
తయారుచేయడం చైత్ర బహుళ ఏకాదశి నాడే మొదలవుతుంది. తిరుపత్తూరు
నుంచీ తెచ్చిన గంధపు చెక్కలను దేవాలయ బేడ మండపంలో మంత్రోచ్చారణల మధ్య స్వామివారి పరివారం అరగదీసి శ్తీగంధాన్ని సిధ్ధము చేస్తారు. తదియనాడు
సుప్రభాతంతో స్వామిని మేలుకొలుపుతారు. ఆ తరువాత చందనోత్తరణం ~ స్వామిపై ఉన్న చందనాన్ని తీయడం ~ ప్రారంభిస్తారు. దీనినే చందనం ఒలుపు అని అంటారు. నిజరూపములోకి వచ్చినవెంటనే స్వామికి శిరస్సున, చాతీపైన మాత్రం చలువ చ్స్ందనాన్ని ముద్దలుగా ఉంచుతారు. ఆ తరువాత అభిషేకం, ఆరఢనలు జరుగుతాయి. మొదటగా స్వంఇ నిజరూప దర్శనం అనువంశిక ధర్మకర్తలకు కలుగచేస్తారు. జీయరులు సహస్రవఘటాభిషేకం చేస్తారు. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల వరకూ భక్తులకు దర్శనము లభిస్తుంది. ఒక్క రాత్రికే మూడు మణుగుల శ్రీగంధాన్ని స్వామికి సమర్పిస్తారు. ఈ చందనసేవ మూడు విడతలుగా ~ మొదట అక్షయ తదియ నాడు రాత్రి; ఆ తరువాత జ్యేష్ట, ఆషాడమాసాలలో పౌర్ణమి తిథులలో జరుగుతుంది. ఈ మూడు విడతలలోనూ కలిపి12మణుగుల చందనం స్వామికి సమర్పిస్తారు.
“సింహశైల నివాసాయ సింహ సూకర రూపిణే ~
శ్రీ వరాహ నృసింహాయ సింహాద్రీశాయ మంగళమ్: