Vizag Vision:.Sri Varahalakshmi Narasimha Swamy Darshan Stopped During Lunar Epic,Visakhapatnam..పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయం లో చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి దర్శనములు నిలిపివేయడం జరిగింది. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల ఆరాధనం, బాలభోగం జరిపించి ఉదయం 6:30ని నుండి ఉదయం 8:30ని వరకు భక్తులకు స్వామివారి దర్శనములు కల్పించారు. అనంతరం దర్శనములు నిలుపుదల చేసి స్వామివారికి రాజభోగం జరిపించి అనంతరం ఉదయం 9:00 గం లకు కవాటబంధనం చేసారు. ఉదయం జరగవలసిన నిత్యకళ్యాణం రద్దుచేయబడినది. మరుసటి రోజు అనగా గురువారం ఉదయం నుండి స్వామివారి దర్శనములు యధావిధిగా భక్తులకు లభించునని అధికారులు తెలిపారు.