కేజ్రీవాల్‌కు భారీ షాక్
– 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి అనర్హత వేటు,,,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగిన ఈ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సిఫారసు చేయగా.. నేడు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఈ 20 స్థానాలకు త్వరలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినప్పటికీ కేజ్రీవాల్ సర్కారుకు ముప్పు లేదు. మేజిక్ ఫిగర్ 35 కాగా, 20 మంది వేటు పడినా ఆప్‌కు ఇంకా 46 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే 20 స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరిగితే కేజ్రీవాల్ ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురవుతుంది.