వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ….మార్చి 4న భారీ ర్యాలీ… మంత్రులు సమక్షంలో సభ…పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రధాన లక్ష్యం
రాష్ర్ట వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (నేషనల్ అలెయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అక్కయ్యపాలెం జంక్షన్ లోని ఒక ప్రయివేటు హోటల్ లో ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి యూనియన్ నేతలు చర్చించారు. అనంతరం గంట్ల శ్రీనుబాబు, నారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన సుమారు 11 డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే ఇందులో అక్రిడేషన్ లు సమస్య కొంత కొలిక్కి వచ్చిందన్నారు. ఇక మిగిలిన డిమాండ్ లకు సంబంధించి మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తమ రాష్ర్ట కార్యవర్గం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇంటి కల నెరవేరలేదని ప్రభుత్వాలు మారుతున్నా కనీసం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించడం లేదన్నారు. అలాగే జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రమాధ భీమా పథకాన్ని పునరుద్దరించాలని , ఇతర రాష్ర్టాల్లో జర్నలిస్టులకు అమలు చేస్తున్న పెన్షన్ విధానం అమలు చేయాలని , మీడియా హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా విద్య, వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తామంతా కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తున్న తరుణంలో సమాజం కోసం పాటు పడుతున్న జర్నలిస్టులకు వారి కుటుంబాలకు కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. అలాగే సుమారు 11 డిమాండ్లతో ఇప్పటికే తాము దశల వారీగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో మరోసారి వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందన్నారు.
మార్చి 4న చలో విజయవాడ
వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్లులు పి.నారాయణలు తెలిపారు. ఆరోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని క్రమేపీ అది సభగా మారుతుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జర్నలిస్టుల సభకు అతిధులుగా రాష్ర్ట సమాచార,పౌరసంబందాల శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ లను ఆహ్వానించడం జరిగిందన్నారు. మంత్రులు హాజరుకానున్న ఈ సభలో జర్నలిస్టుల సమస్యలు వివరించి వాటి పరిష్కారాన్ని కోరుతామన్నారు. కావున రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు డి.రవి కుమార్..ఎ..సాంబశివరావు..పితాని ప్రసాద్..ఉపాధ్యక్షులు బి.శివప్రసాద్..ఆనంద్.
ఎన్.రామకృష్ణ కృష్ణ పాత్రో..కిషోర్..బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మధన్, దేవ త్రినాధ్,శేషు..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ , కార్యదర్శి బొబ్బర ప్రసాద్ చక్రి.. హరి.. రెడ్డి.. నాయుడు.. నగేష్ బాబు..రాజశేఖర్ .జగన్నాధం, కోస మిర్రర్ ప్రసాద్,.సత్యనారాయణతో పాటు పెడరేషన్ ప్రతినిధులు














