శంకర్ ఫౌండేషన్ లో ఉత్సాహముగా సంక్రాంతి సంబరాలు
విశాఖపట్నం: నాయుడుతోట లోని , శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో ఈ రోజు సంక్రాంతి పండుగను సాంప్రదాయ వస్త్ర ధారణతో డాక్టర్లు , మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో జరుపుకొని ఐక్యత భావాన్ని ప్రదర్శించారు అని ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ (పి. ఆర్ ) కె బంగార్రాజు తెలిపారు.
శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ అత్మకూరి కృష్ణ కుమార్ , ట్రస్టీ శ్రీ ఏ విజయ కుమార్ , జనరల్ మేనేజర్ శ్రీ కె రాధా కృష్ణన్ , డాక్టర్లు టి రవీంద్ర , నాశ్రీన్ ,కృష్ణ , శిరీష , సుపర్ణ , తదితలు ఈ వేడుకల్లో పాల్గొని వందలాది ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు .
ముగ్గుల పోటీలు, క్రికెట్ , బాడ్మింటన్ , మ్యూజికల్ చైర్, టగ్ అఫ్ వార్ , లక్కీ డిప్ , చెస్, కారమ్స్ పోటీలలో గెలుపొందిన విజేతలకు కృష్ణ కుమార్ మరియు అతిధులు కేరింతల మధ్య బహుమతులు ప్రదానం చేసారు. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ కృష్ణ కుమార్ సిబ్బంది అంకితభావాన్ని , డాక్టర్ల కృషిని ప్రశంసించి, శంకర్ ఫౌండేషన్ మరింత ఉన్నతశిఖరాలకు చేరుకోగలదని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భముగా మహిళా ఉద్యోగుల మరియు పురుష ఉద్యోగుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి .
ఈ వేడులను గత నాలుగు రోజులుగా నిర్వహించడములో ప్రముఖ పాత్ర పోషించిన డి జి ఎం కె వేణుగోపాల్ , ఏ జి ఎం (హెచ్ . ఆర్ ) ఎస్ కె ల్ రావు , రాజశేఖర్ , ప్రత్యుష , పావని లను కృష్ణ కుమార్ అభినందించారు.
ఫోటో శీర్షిక : 1. బహుమతులు ప్రదానం చేస్తున్న కృష్ణ కుమార్
2. సంక్రాంతి సంబరాలు జడుపుకొంటున్న కృష్ణ కుమార్, డాక్టర్లు , ఉద్యోగులు
3. ముగ్గ్గులపోటీల్లో పాల్గొన్న డాక్టర్లు ఉద్యోగులు.



















