అభివృద్ధి పనుల పై కేంద్ర పోర్టులు నౌకయాన జలరవాణా శాఖ కార్యదర్శి సమీక్ష

కేంద్ర పోర్టులు, నౌకాయాన & జలమార్గాల మంత్రిత్వ శాఖ (MoPSW) కార్యదర్శి శ్రీ విజయ కుమార్, ఐఏఎస్, శుక్రవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA)ను సందర్శించి పోర్టు పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, డిప్యూటీ చైర్పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కొరాటి, ఐఏఎస్ కార్యదర్శికి ఘన స్వాగతం పలికారు. పోర్ట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో కార్యదర్శి కి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించింది.
పోర్ట్ చైర్పర్సన్ పోర్టు కార్యకలాపాలు ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను కార్యదర్శికి వివరించారు.
సమీక్ష సమావేశంలో కార్యదర్శి శ్రీ విజయ కుమార్, ఐఏఎస్, పీపీపీ బెర్త్‌ల పనితీరు, కార్గో హ్యాండ్లింగ్, ఆర్థిక స్థితి, రోడ్డు–రైలు కనెక్టివిటీ, మౌలిక వసతుల ప్రాజెక్టులు, బెర్త్‌ల ఆధునీకరణ మరియు యాంత్రీకరణ, ఫ్లైఓవర్ ల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, గ్రీన్ పోర్ట్ కార్యక్రమాలు తదితర ముఖ్య అంశాలపై సమీక్షించారు.
అనంతరం ఆయన విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCTPL)ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్ స్కానింగ్ సౌకర్యం పనితీరును పరిశీలించారు.
సరుకు రవాణాలో ఇతర పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య …సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పోర్టు అభివృద్ధి కోసం చేస్తున్న కృషి పట్ల పోర్ట్ చైర్ పర్సన్ మరియు టీమ్ ను కార్యదర్శి అభినందించారు. భవిష్యత్తులో కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన ప్రణాళిక అవసరమని ఆయన సూచించారు. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణను అలవరుచుకొని, సంస్థతో పాటు దేశాభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్పర్సన్ మరియు పాటు విభాగాధిపతులు పాల్గొన్నారు.

















