విశాఖ పోర్ట్ లో అగ్నిమాపక వాహనం, రోడ్ స్వీపింగ్ మెషిన్ ప్రారంభించిన డిప్యూటీ చైర్ పర్సన్



విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, అగ్నిమాపక కేంద్రంలో నూతనంగా సమకూర్చుకున్న రోడ్ స్వీపింగ్ మెషిన్ మరియు మల్టీపర్పస్ ఫైర్ టెండర్‌ను 31 డిసెంబర్ 2025న పోర్ట్ డిప్యూటీ చైర్ పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కొరాటి, ఐఏఎస్ ప్రారంభించారు.రూ.3.85 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న మల్టీపర్పస్ ఫైర్ టెండర్ లో… 6 కిలోలీటర్ల నీటి ట్యాంక్, 200 లీటర్ల ఫోమ్ కంపౌండ్, 100 కిలోల డ్రై కెమికల్ పౌడర్ (డీసీపీ), 45 కిలోల కార్బన్ డయాక్సైడ్ (CO₂)తో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు.
ఇక రోడ్ స్వీపింగ్ మెషిన్‌ను పోర్ట్ పరిధిలోని అంతర్గత రహదారులపై ఏర్పడే దుమ్ము, చెత్త, స్పిల్లేజ్ తదితరాలను శుభ్రం చేయడానికి వినియోగించనున్నారు. రూ.4.69 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేయగా, 36 నెలల కాలానికి వార్షిక నిర్వహణ పొందుపరచబడి ఉంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యంత్రం గంటకు 20,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో అన్ని దిశల్లో శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. పోర్టులో ఇప్పటికే అందుబాటులో ఉన్న, మూడు రోడ్ స్వీపింగ్ యంత్రాలకు అదనంగా ఇది చేరింది. పోర్ట్ పరిసర ప్రాంతంలో దుమ్ము , కాలుష్య నియంత్రణకు ఇది మరింత దోహదపడనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ అరుణ్ ప్రసాద్.టి, ఐఈఎస్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, పోర్ట్ విభాగాధిపతులు సీనియర్ అధికారులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















