విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ గారు 31-12-2025 మరియు 01-01-2026 మధ్య నూతన సంవత్సరం రాత్రి వేడుకల సంబంధించి హోటల్స్, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణలకు సంబంధించిన క్రింది మార్గదర్శకాలను జారీచేశారు:

1.హోటల్స్, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణలు, కార్యక్రమాలు/ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే, వారు విశాఖపట్నం పోలీసు కమిషనర్ గారికి అనుమతి కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
2.ఏపీ పబ్లిక్ సేఫ్టీ (మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్, 2013 ప్రకారం, కార్యక్రమ నిర్వాహకులు తమ సంస్థలోని అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లలో రికార్డింగ్ సౌకర్యం ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అలాగే, పార్కింగ్ ప్రదేశాల్లో కూడా రికార్డింగ్ సౌకర్యం ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
3.ప్రతీ జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుంది. కనుక ప్రజలు అప్ప్రమత్తంగా ఉండవలెను.
4.కార్యక్రమ నిర్వాహకులు మరియు నిర్వహణ ప్రదేశంలో ట్రాఫిక్ నిర్వహణ మరియు భద్రత/ప్రవేశం కోసం సరైన సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ఎక్కువ సంఖ్యలో ప్రవేశం / నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేయాలి.
5.నిర్వాహకులు లేదా ఆర్గనైజర్లు ఈ విషయాలు జాగ్రత్తగా పరిగణించాలి. దుస్తులు, నృత్యాలు, చర్యలు, మాటలు అన్నీ సముచితమైన దృక్పథంతో ఉండాలి. ఏటువంటి అశ్లీలత లేదా న్యూడిటీ ఉండకూడదు.
6.ప్రైవేటు రిసార్టు యాజమాన్యాలు 24/7 ఒక సుపర్వైజర్ లేదా గార్డు ని వారి యొక్క స్విమ్మింగ్ పూల్ వద్ద నియమించి, మద్యం మత్తులో ఉన్న ఎవ్వరినీ కూడా స్విమ్మింగ్ పూల్ లోనికి ప్రవేశించకుండా తగు చర్యలు తీసుకోవాలి.
7.శబ్ద స్థాయిలు 45 డెసిబెల్స్ లేదా దాని కంటే తక్కువగా ఉండాలని నిర్ధారించాలి.
8.కార్యక్రమ నిర్వహకులు, ఈవెంట్ ప్రదేశంలో ఎలాంటి ఆయుధాలను అనుమతించరాదు, దీనిని పాటించని యెడల నిర్వహుకులపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి.
9.కార్యక్రమ నిర్వాహకులు, సామర్థ్యాన్ని మించిపోయే పాస్‌లు/టికెట్లు/కూపన్లు ఇవ్వరాదు, ఎందుకంటే ఇది చట్టసమ్మతమైన మరియు శాంతియుత పరిస్థితులను కాపాడలేకపోవచ్చు.
10.కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి, మరియు ట్రాఫిక్ స్వేచ్ఛగా ప్రవహించడంలో ఎలాంటి అడ్డంకులు లేకపోవడం నిర్ధారించాలి.
11.ఆర్గనైజర్లు ప్రాంగణంలో శాంతియుత వాతావరణం, క్రమబద్ధతను నిర్వహించాలి.
12.కపుల్ల కోసం నిర్వహించే కార్యక్రమాలు మరియు పబ్‌ల, బార్లలో మైనర్లను ప్రవేశపెట్టకుండా జాగ్రత్త పడాలి.
13.కార్యక్రమాల నిర్వాహకులకు కఠినంగా హెచ్చరించబడింది – ఎలాంటి వ్యక్తికి మాదకద్రవ్యాలు, నార్కోటిక్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వరాదు. నిర్వాహకులు ఈ విషయాన్ని అడ్డుకోవడంలో విఫలమైతే, వారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి, డ్రగ్స్ రహస్యంగా అమ్మబడే పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర ప్రదేశాలపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
14.నిర్వాహకులు ప్రాంగణంలో వ్యవస్థీకృత పార్కింగ్ మరియు ప్రవేశ-నిష్క్రమణ ద్వారాల ముందు ట్రాఫిక్ నిర్వహణ కోసం సరిపడిన సంఖ్యలో భద్రతా గార్డులను నియమించాలి.
15.నిర్వాహకులు ఎక్సైజ్ విభాగం అనుమతించిన సమయానికి మించి మద్యం అందించకూడదు.
16.మద్యం సేవించి ఉన్న కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరడానికి డ్రైవర్లు/క్యాబ్‌లను అందించే అవసరమైన ఏర్పాట్లు చేయడం పబ్‌లు/బార్ల నిర్వహకుల బాధ్యత.
17.ఏ విధమైన మందుగుండు సామాగ్రి ప్రదర్శించడం లేదా ఉపయోగించడం చేయరాదు
18.District Fire Officer/Regional Fire Officer ఇచ్చిన సూచనలను తప్పకుండా అనుసరించాలి.
19.చైన్ స్నాచర్లు మీ చుట్టుపక్కలు ఉండవచ్చును కనుక మీ యొక్క విలువైన వస్తువులు, బ్యాగులు, జాగ్రత్తగా చూసుకోవాలి.
20.నోవోటేల్ హోటల్ జంక్షన్, R.K బీచ్, భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో “శక్తి-టీమ్స్” లను ఏర్పచినారు. కనుక మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే, సంబంధిత “శక్తి-టీమ్స్” లను సంప్రదించండి.
క్రింది సూచనలను స్టార్ హోటల్స్, పబ్‌లు, క్లబ్‌లు, బార్లు మరియు రెస్టారెంట్లు ప్రవేశ ద్వారం మరియు నిష్క్రమణల వద్ద ప్రదర్శించాలి
a.మద్యం తాగి వాహనం నడపడం మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం నేరం.
b.అనుమతించబడిన మద్యం పరిమితి: రక్తంలో 30 మి.గ్రా/100 మి.లీ లేదా దాని కంటే తక్కువ (30 మైక్రోగ్రామ్/100 మి.లీ). బ్రెత్ అనలైజర్ ద్వారా రికార్డ్ చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఇది చట్ట ఉల్లంఘన.
c.మీరు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారితమైతే, మీపై పోలీసులు కేసు నమోదు చేస్తారు.
d.ఆ పరిస్థితిలో, మీతో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఉంటే, అతను కూడా బ్రెత్ టెస్ట్ చేయించుకోవాలి. అతను మద్యం సేవించనట్లు తేలితే, వాహనం అతనికి అప్పగించబడుతుంది. లేకుంటే, వాహనం తాత్కాలికంగా పోలీసు స్టేషన్‌కు తరలించబడుతుంది.
e.వాహనాన్ని తిరిగి పొందడానికి, తదుపరి పని దినంలో మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో కలిసి పోలీసు స్టేషన్‌కు రావాలి. పోలీసుల సమన్లు వచ్చినప్పుడు కోర్టులో హాజరుకావాలి. మీపై చార్జ్ షీట్ దాఖలు చేయబడుతుంది.
f.కింది శిక్షలు విధించబడవచ్చు:
•మద్యం తాగి వాహనం నడపడం కోసం జరిమానా రూ. 10,000 మరియు/లేదా 6 నెలల జైలుశిక్ష.
•డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేయబడుతుంది.
g.మైనర్లు వాహనాన్ని నడపకూడదు. ఈ విషయంలో వాహన యజమానులపై బాధ్యత విధించబడుతుంది.
h.ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసివేయకూడదు. శబ్ద కాలుష్యాన్ని నివారించాలి.
i.వాహనాలను అధిక వేగంతో, ప్రమాదకర డ్రైవింగ్ మరియు ప్రజా ప్రదేశాల్లో రేసింగ్ చేయడం కూడా మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 183, 184 ప్రకారం శిక్షార్హం.
“డిజిగ్నేటెడ్ డ్రైవర్” అనే సదుపాయాన్ని వినియోగదారులకు వివరించి, వారికి కనిపించే ప్రధాన ప్రదేశాల్లో ప్రదర్శించాలి. ఈ విధానం ప్రకారం, డ్రైవర్ రోజంతా మద్యం సేవించకుండా సహ-ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలి. ఇది వారి భద్రత కోసం అవసరమైన చర్యగా అమలు చేయాలి.
డ్రగ్స్ విషయంలో నగర పోలీసుల విధానం ZERO TOLERANCE:
▪️నగరంలో గల అన్ని లాడ్జీల, హోటళ్లు, రిసార్టులు యందు, హోం స్టే లు, పార్టీ హాలు లు, క్లబ్బులు, పబ్బులు, పార్కులు, బీచ్ లు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సేవించే నిర్మానుష్య ప్రాంతాల యందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
▪️నగరంలో గల పాత డ్రగ్ పెడ్లర్ల పై, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానిత వ్యక్తులపై పూర్తి నిఘా ఉంటుంది.
▪️బస్సు స్టాండ్లు, ఎయిర్పోర్ట్ లు, రైలు స్టేషన్లు, హైవే లు, చెక్ పోస్ట్‌లు, నగర సరిహద్దుల వద్ద, జనసమ్మర్ధ ప్రాంతాలలో నిత్యం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
▪️డ్రగ్స్ తో సంబందముతో NDPS కేసు నమోదు కావడం జరిగితే సదరు నిందితులకు నాన్ బైలబుల్, కఠిన కారాగార శిక్షలతో పాటుగా, పెద్ద మొత్తం లో జరిమానాలు ఉంటాయి.
▪️నూతన సంవత్సరం కార్యక్రమ నిర్వాహకులు తప్పనిసరిగా NO DRUGS/ NO SMOKING బోర్డులను కార్యక్రమం నిర్వహించే ఆవరణలో ఏర్పాటు చేయాలి.
▪️డిసెంబర్ 31 న నగరంలో పోలీసులు మరియు ఈగల్ టీంలు కలిసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగితుంది.
▪️నగరంలో ఎక్కడైనా డ్రగ్స్ ఉన్నట్లు లేదా డ్రగ్స్ సేవిస్తునట్లు అనుమానం కలిగితే నగర పోలీసు కమిషనర్ గారి ఫోన్ నెంబర్ 7995095799 కు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నం- 1972 కు లేదా ఎన్.సి.బి మానస్ హెల్ప్ లైన్ నం- 1933 కు తెలియజేయగలరు, వివరాలు తెలిపిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో గల ట్రాఫిక్ నిబంధనలు:
విశాఖపట్నం నగర ప్రజలందరికి ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా సురక్షితముగా ,ఆనందోత్సహలతో జరుపుకుంటూ ఈ క్రింది తెలిపిన ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని కోరడమైనది.
•వేమన మందిరం నుండి DLO జంక్షన్ వరుకు గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వాహనదారుల భద్రత దృష్ట్యా తేది 31-12-2025 ది రాత్రి 08:00 గంటల నుండి తేది 01-01-2026 తెల్లవారుఝామున 05:00 గంటల వరకు వాహనములు మరియు పాదచారుల రాకపోకలు అనుమతించబడవు.
•సంపత్ వినాయక టెంపుల్: 01వ తేదిన సంపత్ వినాయక గుడి వద్ద వాహనములకు పూజ జరిపించుకొనువారు వారి యొక్క వాహనములను గోటీ సన్స్ నుండి కళామందిర్ వరకు రోడ్డుకి ఎడమ వైపున వాహన రాకపోకలకు ఆటంకము కలుగ కుండా ఒకే ఒక వరుసలో పార్కింగ్ చేసుకొనవలెను. అదేవిధముగా రోడ్డుకు కుడి వైపున జి.వి.యం.సి కమీషనర్ బంగ్లా నుండి వేమన మందిరం వరకు ఒకే ఒక వరుసలో పార్కింగ్ చేసుకొనవలెను. గుడి ముందు వాహన పూజలు అనుమతింపబడవు.
•పార్క్ హోటల్ నుండి NTR Statue వరకు తేది 31-12-2025 రాత్రి 08;00గంటల నుండి తేది 01-01-2026 తెల్లవారుఝామున 05:00 గంటల వరకు ఎలాంటి వాహనాల రాకపోకలు మరియు పార్కింగ్ చేయుటకు అనుమతించబడవు.
•రాత్రి 08 గంటల నుండి ఉదయం 05 గంటల వరకు BRTS రోడ్ హనుమంతవాక నుండి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్, పెందుర్తి జంక్షన్ నుండి NAD జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మధ్య లైను ముసివేయబడును. అత్యవసర వాహనాలు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు గుండా ప్రయాణించవలెను మరియు వాహనదారుల భద్రత దృష్ట్యా రాత్రి 10 గంటల నుండి ఉదయం 05 గంటల వరకు మద్దిలపాలెం జంక్షన్ నుండి రామా టాకీస్ వరకు ఉన్న BRTS రోడ్ మధ్య లైను మరియు RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న under pass మూసివేయబడును అని ప్రజలు గమనించ మనవి.
RK బీచ్ కు వచ్చు సందర్శకులు యొక్క వాహనాల పార్కింగ్ స్థలములు:
బీచ్ సందర్శకులు తమ వాహనములను ఈ క్రింది తెల్పిన పార్కింగ్ స్థలములలో పార్క్ చేసికొని కాలినడకన బీచ్ కు రావలెను.
1.C.R. రెడ్డి జంక్షన్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వైపు నుండి వచ్చు వాహనదారులు వారి వాహనములను, APIIC గ్రౌండ్ లోను తమ వాహనములను పార్క్ చేసుకొనవలెను.
2.కలెక్టర్ ఆఫీస్, కోస్టల్ బాటరీ, నౌరోజీ రోడ్, పందిమెట్ట వైపు నుండి వచ్చు వాహనదారులు వారి వాహనములను గోకుల్ పార్క్, Sea pearl 1,2 and 3 పార్కింగ్ ప్రదేశంలలో పార్క్ చేసుకొనవలెను.
3.సిరిపురం, పార్క్ హోటల్ వైపు నుండి వచ్చు వాహనచోదకులు తమ వాహనము లను ఆంధ్ర యూనివర్సిటీ ఎక్సిబిషన్ గ్రౌండ్ లోను మరియు డచ్ హౌస్ apartments ముందు గల GVMC పార్క్ నందు పార్కు చేసుకొని బీచ్ రోడ్డు లోకి రావలెను.
4.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు నిబంధనలు ప్రకారం సరియైన సమయానికే కార్యక్రమాలు ముగించాలి.
5.వాహనాలను సక్రమంగా పార్కింగు చేయుటకుగాను స్థలమును కేటాయించి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని వాడవలెను. వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదు.
6.ప్రతీ జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుంది. కనుక ప్రజలు అప్ప్రమత్తంగా ఉండవలెను.
7.మద్యం త్రాగి వాహనములు నడిపే వారిపై, మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వారిపై ఆల్కో మీటర్లతో ప్రత్యేక డ్రైవ్‌లు తేది 31-12-2025 ది రాత్రి 08:00 గంటల నుండి తేది 01-01-2026 తెల్లవారుఝామున 05:00 గంటల వరకు నిర్ హించబడును. అటువంటి సంఘటనల్లో వారి వాహనాన్ని సీజ్ చేసుకొని నిందితులను డ్రంకెన్ డ్రైవ్ నేరం కింద కేసులు బుక్ చేసి సంబంధిత కోర్టులలో హాజరు పెట్టబడును.
8.ఆకతాయిలను, మితిమీరి ప్రవర్తించే వారిపై, రోడ్లపై చిందులు తొక్కే మందుబాబులపై టౌన్ న్యుసేన్సు కేసులు మరియు బహిరంగంగా మద్యం సేవించేవారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసి తగు చట్టపరమైన చర్యలు తీసుకొనబడును.
9.ఇష్టానుసారంగాను మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని చిత్రీకరించేందుకు బాడీ వార్న్ కెమెరాలను మరియు వీడియో కెమెరాలను ఉపయోగించి, అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును.
10.ద్విచక్ర వాహనం పై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ డ్రైవింగ్), మైనర్ లు వాహనాలు నడపడం, వాహనాలను అతి వేగంగా నడపడం, సైలెన్సర్ తీసి మరియు హారన్స్ అదే పనిగా మ్రోగించిశబ్ద కాలుష్యం చేసే వాహనములను, రాంగ్ రూటులలో డ్రైవ్ చేయడం, వాహనం పై విన్యాసాలు చేయడం, జిగ్ జాగ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, రాంగ్ పార్కింగ్ చెయ్యడం, బైక్ రైడర్ మరియు బైక్ వేనుకకూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకుండా ఉన్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించడం మొదలైన చర్యలను నిరోధించడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అటువంటి వారి యొక్క వాహనములను సీజ్ చేసి, వారి డ్రైవింగ్ లైసెన్సు లను రద్దు చేసి, అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును.
11.డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వాహనములు ఇచ్చిన యెడల పిల్లల పైన మరియు వాహన యజమానుల పైన క్రిమినల్ చర్యలు తీసుకొనబడును.
12.హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిళ్ళపై ప్రయాణించడం ప్రమాదం మరియు నేరము. కావున అటువంటి వారిపై కేసులను నమోదు చేయబడును. వాహనములను అనుమతి లేని చోట పార్కింగ్ చేయరాదు. అట్లు చేసిన యెడల అట్టి వాహనములను టోయింగు చేసి కేసు నమోదు చేయబడును.
బీచ్ రోడ్డు:
1.నూతన సంవత్సర వేడుకలలో భాగంగా బీచ్ రోడ్డులో చాలా మంది సందర్శకులతో రద్దీ గా ఉంటుంది కావున ప్రజల సౌకర్యార్దము సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, ప్రమాదాలు జరుగకుండా, ఆకతాయి చేష్టలు నిరోధించుటకై తగు చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
2.శుభాకాంక్షలు తెలిపే నెపంతో ఇతర మహిళల చేతులను పట్టుకొని వేధించడము, అసభ్యకర పదజాలం ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయబడును.
3.డ్రోన్ కెమెరాలతో బీచ్ పరిసర ప్రాంతముల లో నిఘా పెట్టడము జరిగినది.
4.ఫైర్ క్రాకర్స్ ను (బాణాసంచా) బీచ్ లో కాల్చరాదు.
5.నూతన సంవత్సరం సందర్భంగా సందర్శకులు బీచ్ లో రాత్రి సమయం లో సముద్ర స్నానానికి దిగరాదు
6.డ్రగ్స్ వినియోగం పూర్తిగా నిషిద్దం మరియు చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం, డ్రగ్స్ వినియోగించి పట్టుబడినట్టు అయితే వారితో పాటూ నిర్వహించిన ప్రాంత యాజమాన్యం మరియు నిర్వాహుకులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది.
7.నగర పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం కలిగినా సీపీ గారి వాట్సాప్ నంబర్ కు 7995095799 పోలీసు హెల్ప్ లైన్ 112 కు తెలియజేయవలసినదిగా, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని నగర పోలీసు వారి విజ్ఞప్తి.
8.చైన్ స్నాచార్లు మీ చుట్టుపక్కలు ఉండవచ్చును కనుక మీ యొక్క విలువైన వస్తువులు, బ్యాగులు, జాగ్రత్తగా చూసుకోవాలి.
9.నోవోటేల్ హోటల్ జంక్షన్, R.K బీచ్, భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో “షీ-టీమ్స్” లను ఏర్పచినారు. కనుక మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే, సంబందిత“షీ-టీమ్స్” లను సంప్రదించండి.
నగరంలో ఎక్కడైనా డ్రగ్స్ ఉన్నట్లు లేదా డ్రగ్స్ సేవిస్తునట్లు అనుమానం కలిగితే *నగర పోలీసు కమిషనర్ గారి ఫోన్ నెంబర్ 7995095799*, *ఈగల్ టోల్ ఫ్రీ నం- 1972*, *ఎన్.సి.బి మానస్ హెల్ప్ లైన్ నం- 1933*, *డైల్-112* కు తెలుపగలరు, వివరాలు తెలిపిన వ్యక్తుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
మన విశాఖ నగరాన్ని రోడ్డు ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దటానికి సహకరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని కోరుతూ.
నగర పోలీస్ తరపున,
విశాఖపట్నం సిటీ.















