విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి నిర్వహిస్తున్న మూడు రోజుల నృత్యోత్సవాలలో చివరి రోజు రెండు కార్యక్రమాలు జరిగాయి.ఒకటి బెంగళూరు వాస్తవ్యవుడు భరతనాట్యం, రెండవది నృత్య కలానికేతన్, కూర్మన్నపాలెం వారి “శ్రీనివాస కళ్యాణం” కూచిపూడి నృత్య రూపకం.




ముందుగా కళాభారతి అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు కార్యదర్శి శ్రీరామదాసు డాక్టర్ రాంబాబు కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథి శ్రీ రాజేంద్ర, ఆల్వార్ దాస్ గ్రూప్ చైర్మన్, శ్రీ నర్సింగ్ రావు జ్యోతి ప్రకాశనం చేసి సుభారభం చేశారు.
అధ్యక్షులు MSN రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్యోత్సవం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అశేషంగా ప్రేక్షకులు రావాలన్న మకోరికకు తగ్గట్టుగా అధికంగా రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అన్ని కళలను పోషించడమే కళాభారతి ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ముఖ్య అతిథి శ్రీరాజేంద్ర మాట్లాడుతూ మన వెలకట్టలేని ప్రాచీన కళారూపకాలన్నీ కాపాడుతూ అనేక కార్యక్రమాలు ఈ ప్రముఖ వేదిక మీద నిర్వహిస్తూ వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు కళాభారతి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తపరిచారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మా వంతు చేయూత అందిస్తామని పేర్కొన్నారు.
తర్వాత జరిగిన భరత నాట్య కార్యక్రమంలో ముందుగా బెంగుళూరు వాస్తవ్యులు శ్రీ పి ప్రవీణ్ కుమార్ పలు భరతనాట్య అంశాలను దశావతార శబ్దం, జావలి నృత్యం చేసి అందరిమెప్పు పొందారు.
తదనంతరం నృత్య కళా నీకేతన్ డాన్స్ స్కూల్, కూర్మన్నపాలెం, విశాఖపట్నం, ప్రిన్సిపాల్ గురు శ్రీమతి కె హైమావతి శిష్య బృందం 47 విద్యార్థులచే చే “శ్రీ శ్రీనివాస కళ్యాణం ” కూచిపూడి నృత్య రూపకం అత్యంత అద్భుతంగా ప్రదర్శించి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అలివేలు మంగలను సాక్షాత్కరింపజేసేరు చేశారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ నృత్య రూపంలో గోవిందుని జననం, వకుళా మాత పెంపకం, వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టం, నృత్య రూపంకంలో అద్భుతంగా నర్తించి, నృత్త, నృత్య, లయ ప్రాధాన్యాన్ని తప్పకుండా ప్రదర్శించారు కళాకారులందరూ.
గురువుని, అందరి కళాకారులను ప్రశంసా పత్రాలు జ్ఞాపకలతో సత్కరించారు అధ్యక్ష కార్యదర్శులు.
చివరిలో కళాభారతి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నేటి ముఖ్య అతిథి రాజేందర్ ని దుస్సాలువతో జ్ఞాపకతో సత్కరించారు.
అలాగే మొదటి రోజు చక్కటి ప్రశంసాపత్రాన్ని రాసినందుకు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ ని, మూడు రోజుల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన శ్రీ పంతుల నరసింగారావుని ఘనంగా సత్కరించారు.
చివరిగా కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ నేటితో మూడు రోజుల నృత్య ఉత్సవాలు ముగిశాయని మూడు రోజులు ప్రేక్షకులు చాలా అధికంగా విచ్చేసి అందరి కళాకారులని వారి హర్షధానాలతో ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
జనవరి 6 నుంచి 12వ తారీకు వరకు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఉంటాయని అందులో వెయ్యి మందికి పైగా కళాకారులు పాల్గొననున్నారని అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు















