HomeUncategorizedVisakhapatnam Vizagvision:విశాఖపట్నం పోర్ట్ కార్యదర్శి శ్రీ టి. వేణుగోపాల్ కు పరదీప్ పోర్ట్ డెప్యూటీ చైర్మన్గా పదోన్నతి”విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి శ్రీ టి. వేణుగోపాల్ కు పరదీప్ పోర్ట్ అథారిటీ డెప్యూటీ చైర్మన్గా పదోన్నతి పొందారు. ఆయనను పరదీప్ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర పోర్టులు నౌకా జలరవనాంశాఖా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ వేణుగోపాల్ 1995లో విశాఖపట్నం పోర్టులో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం పోర్టులోని వివిధ విభాగాల్లో పలు పదవుల్లో సేవలందించారు. 2019లో ఆయన కార్యదర్శిగా పదోన్నతిపై దీన్ దయాళ్ (కాండ్లా) పోర్ట్ అథారిటీలో సేవలు అందించారు. 2020లో తిరిగి విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో కార్యదర్శిగా బదిలీ అయ్యి ఇప్పటివరకు సేవలు అందిస్తున్నారు.తన పదవీకాలంలో ఆయన BIMSTEC, ఇండియన్ మేరిటైమ్ కాన్క్లేవ్లు, ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభోత్సవం, అంతర్జాతీయ క్రూయిజ్ నౌకల విశాఖ పోర్ట్ సందర్శనలు వంటి అనేక ప్రధాన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.తన అంకితభావం, ప్రతిభావంతమైన సేవలను కేంద్ర మంత్రిత్వశాఖ గుర్తించి సముచితంగా గౌరవించింది.శ్రీ వేణుగోపాల్ గారి పదోన్నతి పట్ల విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయన తన నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు
Visakhapatnam Vizagvision:విశాఖపట్నం పోర్ట్ కార్యదర్శి శ్రీ టి. వేణుగోపాల్ కు పరదీప్ పోర్ట్ డెప్యూటీ చైర్మన్గా పదోన్నతి”విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి శ్రీ టి. వేణుగోపాల్ కు పరదీప్ పోర్ట్ అథారిటీ డెప్యూటీ చైర్మన్గా పదోన్నతి పొందారు. ఆయనను పరదీప్ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర పోర్టులు నౌకా జలరవనాంశాఖా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ వేణుగోపాల్ 1995లో విశాఖపట్నం పోర్టులో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం పోర్టులోని వివిధ విభాగాల్లో పలు పదవుల్లో సేవలందించారు. 2019లో ఆయన కార్యదర్శిగా పదోన్నతిపై దీన్ దయాళ్ (కాండ్లా) పోర్ట్ అథారిటీలో సేవలు అందించారు. 2020లో తిరిగి విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో కార్యదర్శిగా బదిలీ అయ్యి ఇప్పటివరకు సేవలు అందిస్తున్నారు.తన పదవీకాలంలో ఆయన BIMSTEC, ఇండియన్ మేరిటైమ్ కాన్క్లేవ్లు, ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభోత్సవం, అంతర్జాతీయ క్రూయిజ్ నౌకల విశాఖ పోర్ట్ సందర్శనలు వంటి అనేక ప్రధాన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.తన అంకితభావం, ప్రతిభావంతమైన సేవలను కేంద్ర మంత్రిత్వశాఖ గుర్తించి సముచితంగా గౌరవించింది.శ్రీ వేణుగోపాల్ గారి పదోన్నతి పట్ల విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయన తన నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు