#Live Cyclone Montha బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ తీవ్రమవుతోంది APకి రెడ్ అలెర్ట్… భయపెడుతున్న మొంథా.. ఏపీ-తెలంగాణకు రెడ్ అలెర్ట్.. స్కూళ్లకు సెలవులు..
బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ తీవ్రమవుతోంది. ఇది మంగళవారం రాత్రికి కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, కృష్ణా, నెల్లూరు సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన మూడు గంటల్లో గంటకు 13-18 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి తుపాను చెన్నైకి 600-640 కి.మీ., విశాఖపట్నంకి 710-740 కి.మీ., కాకినాడకి 680-710 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ ఉదయానికి తుపానుగా బలపడి.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మొంథా తుపాను మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision/















