శబరిమల అయ్యప్పను దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…
ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కిిన రాష్ట్రపతి ముర్ము.. అయ్యప్పకు ప్రత్యేక పూజలు
కేరళలోని ప్రసిద్ధ క్షేత్రం శబరిమలలో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పంబ నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడ ఇరుముడి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనతో శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి భారత రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.



రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఆమె ప్రయా ణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. అప్ర మత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దించారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు బయల్దేరారు.















