దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం పోర్ట్ కు VLGC నౌక “శివాలిక్” రాక

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం కిందకు వచ్చిన VLGC (వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్) నౌక దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం పోర్ట్ కు వస్తున్న సందర్భంగా కేంద్ర పోర్టులు నౌక మరియు జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ విశాఖలో ఘనంగా స్వాగతం పలకనున్నారు.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) ఇటీవల 2025 సెప్టెంబర్ 10న “శివాలిక్” నౌకను భారత జెండా కింద నమోదు చేసుకుని స్వాధీనం చేసుకుంది. భారత సముద్ర రవాణా రంగంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోంది. భారత యాజమాన్యం మరియు భారత జెండా కింద నడుస్తున్న ఈ నౌక, విశాఖపట్నం పోర్ట్‌కు తన తొలి ప్రయాణంలో LPG సరుకును తీసుకురానుంది. ఈ సందర్భంగా భారత గ్యాస్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక అడుగుగా నిలుస్తుంది.
కార్యక్రమ ప్రాధాన్యం
• “శివాలిక్” నౌక భారత జెండా కింద దేశానికి ఇదే మొట్టమొదటిసారి రావడం – ఇది భారత షిప్పింగ్ రంగానికి మరియు SCIకి గర్వకారణమైన ఘట్టం
• పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ మంత్రి స్వయంగా నౌక రాకకు స్వాగతం పలికి, అధికారులు మరియు సిబ్బందిని అభినందించడం ద్వారా ద్వారా భారత షిప్పింగ్ సంస్థల పట్ల ప్రభుత్వ ప్రాధాన్యతను సూచిస్తుంది.
• ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం శక్తి….రవాణా, సముద్ర భద్రత, మరియు ప్రపంచ వ్యాప్తంగా పోటీ …సామర్థ్యాల్లో వేగంగా ఎదుగుతోందని చాటుతుంది.
విశాఖపట్నం పర్యటనలో గౌరవ మంత్రి శాలీగ్రాంపురం లోని సాగరమాల కన్వెన్షన్ హాల్లో జరిగే బహిరంగ సమావేశంలో పాల్గొని, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు పోర్టు మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణా సామర్థ్యాల పెంపు, మరియు పర్యావరణహిత హరిత పోర్ట్ చర్యలను మారిటైమ్ ఇండియా విజన్ 2030కు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తాయి.
గౌరవ మంత్రివర్యుల పర్యటన మరియు VLGC “శివాలిక్” నౌక ప్రారంభం తూర్పు తీరంలో సముద్ర వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, విశాఖపట్నం పోర్ట్‌ను శక్తి మరియు సరుకు రవాణాకు ప్రధాన ద్వారంగా నిలబెడుతుంది.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఈ కార్యక్రమానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. మంత్రిత్వ శాఖ, ఎస్సిఐ, మరియు విపిఎ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి శ్రీ టి. వేణు గోపాల్ గారు పై వివరాలను పత్రికలు మరియు మీడియాకు విడుదల చేశారు.
















