భారత్ లోని నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ మరియు నెదర్లాండ్స్ ఎంబసీ ప్రతినిధి బృందం మంగళవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించారు.
పోర్ట్ డిప్యూటీ ఛైర్పర్సన్ శ్రీ దుర్గేష్ కుమార్ దూబే, కార్యదర్శి మరియు ఇతర ముఖ్య అధికారులతో కలిసి రాయబారి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం పోర్ట్ కార్యకలాపాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలను నెదర్లాండ్స్ రాయబారి బృందానికి వివరించారు.
పోర్ట్ లో ఉన్న మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ–యాంత్రీకరణ చర్యలు, కవర్డ్ స్టోరేజ్ సౌకర్యాలు, సౌర శక్తి వినియోగం, అంతర్జాతీయ క్రూయిజ్ సౌకర్యం, పారిశ్రామిక అవసరాల కోసం ఎస్టిపి తో నీరు పునర్వినియోగం వంటి అంశాలను రాయబారికి వివరించారు. పోర్టులో ఉన్న పెట్టుబడి అవకాశాలు మరియు విశాఖపట్నం పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేసే మార్గాలపై చర్చలు జరిగాయి.
విశాఖపట్నం పోర్ట్ CPPI (Container Port Performance Index) లో ప్రపంచ స్థాయిలో 19వ స్థానాన్ని సాధించినందుకు మరియు సౌర విద్యుత్ వినియోగం, హరిత–శుభ్రత కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు పోర్ట్ మేనేజ్మెంట్ను నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ గారు, అభినందించారు.
















