సీఎం చంద్రబాబుకు అధునాతన ఫీచర్లతో కొత్త హెలికాఫ్టర్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్ మారిపోయింది.. కొన్ని రోజుల క్రితం వరకు వాడిన హెలికాప్టర్ బాగా పాతది కావడంతో.. ఇప్పుడు అత్యాధునిక ఫీచర్లతో కొత్త హెలికాప్టర్ వాడుతున్నారు. సీఎం చంద్రబాబు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. రెండు వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇటీవలి వరకు వాడిన బెల్ తయారీ ఛాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారు.

















