అభిలాష్ కనస్ట్రక్షన్స్ యక్ష ప్రైడ్ ఆవిష్కరణ


రియల్ ఎస్టేట్ రంగంలో గత 38 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన విశ్వసనీయమైన నిర్మాణ సంస్థ అభిలాష్ కనస్ట్రక్షన్స్ తమ మరో ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ మార్క్ గేటెడ్ కమ్యూనిటీ “ యక్ష ప్రైడ్ “ ను విశాఖపట్నంలోని ఆనందపురం జాతీయ రహదారికి సమీపంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ కేటేడ్ కమ్యూనిటీ నందు మొత్తం 40 ప్రత్యేకత కలిగిన లగ్జరీ విల్లాలు మరియు 264 ప్రీమీయం అపార్టుమెంట్లు ఉంటాయి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన యక్ష ప్రైడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో విశాఖపట్నం లోక్ సభ సభ్యులు శ్రీ భారత్ అభిలాష్ కనస్ట్రక్షన్స్ వారు చేపట్టిన యక్ష ప్రైడ్ ప్రాజెక్టు విజన్ ను వారు ప్రశంసించారు.
అభిలాష్ కనస్ట్రక్షన్స్ యక్ష ప్రైడ్ ఆవిష్కరణ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ అభిలాష్ మరియు డైరక్టర్ శ్రీమతి దివ్య అభిలాష్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్ తోటి అధునిక జీవన సరళికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అన్ని వర్గాల కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని మరియు వారి పెట్టుబడికి మంచి విలువను అందిస్తుందని వారు ఈ సందర్భంగా చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అతిధులకు మరియు మీడియా వారికి ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ వినుత్నమైన ప్రతిష్టాత్మక నిర్మాణం అభిలాష్ కనస్ట్రక్షన్స్ వారి మరో గొప్ప మైలురాయి అవుతుందని మరియు తమపట్ల ప్రజల విశాసాన్ని రెట్టింపు చేస్తుందని, అందుకోసం మేము నిబద్దతతో ముందుకు సాగుతామని వారు ఈ సందర్భంగా చెప్పారు.















