విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి నిర్వహిస్తున్న 6 రోజుల వార్షిక సంగీత, నృత్య నాటక ఉత్సవాలలో 5వ రోజున బెంగళూరు వాస్తవ్యులు గురు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో “శ్రీకృష్ణ కల్పతరు” అనే కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది.




కార్యక్రమానికి ముందుగా నేటి ముఖ్య అతిధులు Ms. గీత వరలక్ష్మి – హెడ్ HR, AMTZ, శ్రీ దిలీప్ కుమార్ చేకూరి – CEO of incubation centre of AMTZ,
కళాభారతి అధ్యక్షులు శ్రీ ఎం ఎస్ ఎం రాజు, కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ రాంబాబు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, శ్రీ పిల్లా రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు.
ముఖ్య అతిధిలు మాట్లాడుతూ మన కళలను, సంస్కృతిని, సంప్రదాయాన్ని కళాభారతి యాజమాన్యం కాపాడుతున్న తీరు చాలా అభినందనీయమని ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఈనాడు ప్రదర్శించిన కూచిపూడి రూపకంలో 29 మంది కళాకారులలో 10 మంది మా కళాభారతి నృత్య కళాశాల విద్యార్థులు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
కార్యదర్శి Dr. రాంబాబు మాట్లాడుతూ మన కళాఖండాలలో ముఖ్యమైనది నృత్యం ఒకటి. దాని ద్వారా అనేక అనేక రూపకాలు ప్రదర్శిస్తూ మానవాళికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని అలాగే ఈరోజు ప్రదర్శితమైన “శ్రీకృష్ణ కల్పతరు” నృత్యంలో శ్రీమహావిష్ణువు దుష్ట jశిక్షణ శిష్ట రక్షణ చేసేందుకు అనేక అవతారాలు ఎత్తడం మనందరికీ తెలిసిన విషయమేఅని,
ఇవ్వాళ డాక్టర్ వసంత్ కిరణ్ గారి “భరత కళా గ్రామ” బృందం చేత “హరిలీలా కల్పతరు” అనే కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని . నరసింహ అవతారం, ప్రహ్లాద రక్షణ, కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారని కొనియాడారు.
రామాయణ, మహాభారత, భాగవత, వేంకటాచల మహత్యం వంటి అన్ని పుణ్య కథలను కళానైపుణ్యంతో ప్రదర్శించిన తీరు అద్వితీయం.
రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి పాత్రల్లో డాక్టర్ వసంత్ కిరణ్ తనదైన విశేష ప్రతిభతో ముగ్ధమనోహరంగా అనునయించారు.
ఈ రూపకం డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి గారు రంచించగా, శ్రీ డి ఎస్ వి శాస్త్రి గారి స్వరకల్పనతో, గురు శ్రీమతి మంజు భార్గవి గారి ఆశీస్సులతో కేంద్ర సంగీత నాటక అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. వసంత్ కిరణ్ గారి నృత్య దర్శకత్వంలో వినాయక చవితి పుణ్య తిథి నాడు ప్రేక్షకులకు భగవత్ లీలలను దర్శింపజేసినారు.
వినాయక చతుర్థి సందర్భంగా వచ్చిన వారందరికీ ప్రసాద విత్తరణ జరిగింది.
రేపు అంటే 28వ తారీకు గురువారం ఈ ఉత్సవాలలో ఆఖరి రోజు కార్యక్రమంలో విజయవాడ వారు డాక్టర్ క్. V. N. కృష్ణ దర్శకత్వంలో చారిత్రాత్మక పద్య నాటకం “శ్రీ ఖడ్గ తిక్కన” ఉంటుందని 33 మంది కళాకారులతో ప్రదర్శతమవబోతున్న ఈ నాటకానికి ప్రేక్షకులు అధికంగా వచ్చి చూసి, ఆనందించి ప్రోత్సహించాలని అధ్యక్ష కార్యదర్సులు కోరారు.















