HomeUncategorizedVisakhapatnam Vizagvision: విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి 2025 సంవత్సరంలో వార్షిక సంగీత నృత్య నాటక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవరోజు. ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు విజయవాడ వాస్తవ్యులు విష్ణుభట్ల సిస్టర్స్ గా పేరుగాంచిన వారి గాత్ర సంగీత కచేరి జరిగింది. కచరేకి ముందు కళాభారతి అధ్యక్షులు MSN రాజు, కార్యదర్శి ‘ శ్రీరామదాస’ డాక్టర్ రాంబాబు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, శ్రీ పిల్ల రమణమూర్తి, విష్ణు భట్ల సిస్టర్స్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. తర్వాత జరిగిన విష్ణుభట్ల సోదరిమనుల సంగీత కచేరిలో మొదటగా శాస్త్రీయబద్ధంగా ‘ఏమని వర్ణింతు” వర్ణం ఆదితాళం, రసిక ప్రియరాగంలో గానం చేసి శుభారంభం చేశారు. తర్వాత అంశంగా” శ్రీ మహాగణపతిం భజే” అఠాణరాగం లో ఆది తాళంలో చక్కగా గానం చేశారు.తర్వాత అంశం” నన్ను విడచి కదలకురా ” రీతిగౌళ రాగంలో, మిశ్ర చాపు తాళం లో త్యాగరా స్వామి కీర్తన రాగాలాపన, స్వర కల్పన అద్భుతంగా చేసి ప్రేక్షకుల మెప్పును పొందారు గాయని మణులు. తర్వాత అంశంగా” కామాక్షి కామకోటి పీఠ వాసిని” సుమనధ్యుతి రాగంలో రూపకతాళంలో దీక్షితర్ వారి కీర్తన చాలా రసరమ్యంగా గానం చేసారు.తరువాత “నన్ను విడిచి కదలకు రా” రీతి గౌళ రాగం,తరువాత ” పాలించు కామాక్షి” మద్యమావతి రాగం, ఆదితాళంలో శ్రీ శ్యామశాస్త్రి గారి రచనను గానం చేసి శభాష్ అనిపించుకున్నారు. చివరగా “సొంపైన మనసుతో” త్యాగరాజ స్వామి వారి కీర్తనని గానం చేశారు.చివరిగా శ్రీరామదాసు, అన్నమయ్య కీర్తనలు పాడి మంగళంతో ముగించాటు.ప్రధాన అంశంలో వైయోలిన్ పై సహకరించిన డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ చాలా ఉన్నత స్థాయిలో సహకరించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. శ్రీ BVS ప్రసాద్ మృదంగంపై, హరి బాబు ఘటంపై ఇద్దరూ పోటీపడి అత్యంత అద్భుతంగా వాయించిన తీరు ఒక జుగల్ బంది లా సాగి అందరికి అభిమానాన్ని చూరగొన్నారు. వైలెన్, మదంగం,ఘటం పై సహకారం అందించి కచేరి స్థాయిని పెంచే విధంగా సాగి అందరి హర్షద్వానాలను పొందారు. కచేరి అనంతరం డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ రేపటి కార్యక్రమం బెంగళూరు బ్రదర్స్ గా ప్రసిద్ధిగాంచిన గాయకులు కర్ణాటక గాత్ర సంగీత యుగళo ఉంటుందని వారికి శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి వయోలిన్ పై, Dr.వంకాయల వెంకటరమణ మృదంగంపై, శ్రీ హరిబాబు ఘటంపై సహకరించనున్నారని ఈ గొప్ప కచేరి కూడా అందరూ శ్రోతలు వచ్చి ఆనందించాలని కోరారు.
Visakhapatnam Vizagvision: విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి 2025 సంవత్సరంలో వార్షిక సంగీత నృత్య నాటక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవరోజు. ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు విజయవాడ వాస్తవ్యులు విష్ణుభట్ల సిస్టర్స్ గా పేరుగాంచిన వారి గాత్ర సంగీత కచేరి జరిగింది. కచరేకి ముందు కళాభారతి అధ్యక్షులు MSN రాజు, కార్యదర్శి ‘ శ్రీరామదాస’ డాక్టర్ రాంబాబు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, శ్రీ పిల్ల రమణమూర్తి, విష్ణు భట్ల సిస్టర్స్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. తర్వాత జరిగిన విష్ణుభట్ల సోదరిమనుల సంగీత కచేరిలో మొదటగా శాస్త్రీయబద్ధంగా ‘ఏమని వర్ణింతు” వర్ణం ఆదితాళం, రసిక ప్రియరాగంలో గానం చేసి శుభారంభం చేశారు. తర్వాత అంశంగా” శ్రీ మహాగణపతిం భజే” అఠాణరాగం లో ఆది తాళంలో చక్కగా గానం చేశారు.తర్వాత అంశం” నన్ను విడచి కదలకురా ” రీతిగౌళ రాగంలో, మిశ్ర చాపు తాళం లో త్యాగరా స్వామి కీర్తన రాగాలాపన, స్వర కల్పన అద్భుతంగా చేసి ప్రేక్షకుల మెప్పును పొందారు గాయని మణులు. తర్వాత అంశంగా” కామాక్షి కామకోటి పీఠ వాసిని” సుమనధ్యుతి రాగంలో రూపకతాళంలో దీక్షితర్ వారి కీర్తన చాలా రసరమ్యంగా గానం చేసారు.తరువాత “నన్ను విడిచి కదలకు రా” రీతి గౌళ రాగం,తరువాత ” పాలించు కామాక్షి” మద్యమావతి రాగం, ఆదితాళంలో శ్రీ శ్యామశాస్త్రి గారి రచనను గానం చేసి శభాష్ అనిపించుకున్నారు. చివరగా “సొంపైన మనసుతో” త్యాగరాజ స్వామి వారి కీర్తనని గానం చేశారు.చివరిగా శ్రీరామదాసు, అన్నమయ్య కీర్తనలు పాడి మంగళంతో ముగించాటు.ప్రధాన అంశంలో వైయోలిన్ పై సహకరించిన డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ చాలా ఉన్నత స్థాయిలో సహకరించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. శ్రీ BVS ప్రసాద్ మృదంగంపై, హరి బాబు ఘటంపై ఇద్దరూ పోటీపడి అత్యంత అద్భుతంగా వాయించిన తీరు ఒక జుగల్ బంది లా సాగి అందరికి అభిమానాన్ని చూరగొన్నారు. వైలెన్, మదంగం,ఘటం పై సహకారం అందించి కచేరి స్థాయిని పెంచే విధంగా సాగి అందరి హర్షద్వానాలను పొందారు. కచేరి అనంతరం డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ రేపటి కార్యక్రమం బెంగళూరు బ్రదర్స్ గా ప్రసిద్ధిగాంచిన గాయకులు కర్ణాటక గాత్ర సంగీత యుగళo ఉంటుందని వారికి శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి వయోలిన్ పై, Dr.వంకాయల వెంకటరమణ మృదంగంపై, శ్రీ హరిబాబు ఘటంపై సహకరించనున్నారని ఈ గొప్ప కచేరి కూడా అందరూ శ్రోతలు వచ్చి ఆనందించాలని కోరారు.