HomeUncategorizedVisakhapatnam Vizag vision: పోర్టులో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అక్కయ్యపాలెం పోర్టు గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికగా నలిచింది. పోర్టు చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు, ఐఏఎస్ ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF contingent) గౌరవ వందనం సమర్పించగా, చైర్పర్సన్ పరేడ్‌ని పరిశీలించి వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు మాట్లాడుతూ ముందుగా పోర్టు అధికారులు, సిబ్బంది, స్టీవిడోర్లు, స్టేక్హోల్డర్లు, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం నగర ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనకు పోర్టు కట్టుబడి ఉందని చైర్ పర్సన్ వెల్లడించారు. సమాజానికి మేలు చేయడంలో పోర్టు ఎప్పుడూ ముందుకు ఉంటుందని అన్నారు. స్వచ్చ భారత్ లో విశాఖపట్నం పోర్టు దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచిందని ఇందుకు సహకరించిన పోర్టు ఉద్యోగులను ఆయన ప్రసంసించారు.విశాఖపట్నంలో కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్ధానిక అధికార యంత్రంగంతో కలిసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి కృషి చేస్తున్నట్లు చైర్ పర్సన్ వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో పోర్టు చరిత్రలోనే రికార్డు స్ధాయిలో సరుకు రవాణా చేసినట్లు చైర్ పర్సన్ వెల్లడించారు. ఈ ఏడాది కూడా పోర్టు సరుకు రావణాలో మంచి ప్రతిభ కనబరుస్తోందని తెలిపారు. సామాజిక బాధ్యతలో బాగంగా సమాజ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా దేశ భక్తిని చాటేలా నిర్వహించిన పలు సాంస్కృతి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ద్వారా విఐపి భద్రతకు సంబంధించి నిర్వహించిన మాక్ డ్రిల్, స్నిఫర్ డాగ్ ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఆపరేషన్ సింధూర్ తో దేశభక్తిని ప్రదర్శించేలా చేసిన నృత్య రూపకం అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్బంగా పోర్టులో పనితీరులో విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, పోర్టు భాగస్వాములు, స్టేక్ హోల్డర్ లకు చైర్ పర్సన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేడుకలను విజయవతంగా నిర్వహించిన డిప్యూటీ చైర్ పర్సన్, చీప్ విజిలెన్స్ అధికారి, పోర్టు కార్యదర్సి, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మరియు విభాగాధిపతుల కృషిని చైర్ పర్సన్ ప్రసంసించారు. స్టేక్హోల్డర్లు, ట్రేడ్ పార్టనర్స్ ల నిరంతరం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోర్ట్ అభివృద్ధి కోసం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరింత అంకితభావం, నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ వివరాలను పోర్టు కార్యదర్సి శ్రీ టి వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.****
Visakhapatnam Vizag vision: పోర్టులో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. అక్కయ్యపాలెం పోర్టు గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికగా నలిచింది. పోర్టు చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు, ఐఏఎస్ ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF contingent) గౌరవ వందనం సమర్పించగా, చైర్పర్సన్ పరేడ్‌ని పరిశీలించి వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు మాట్లాడుతూ ముందుగా పోర్టు అధికారులు, సిబ్బంది, స్టీవిడోర్లు, స్టేక్హోల్డర్లు, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం నగర ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనకు పోర్టు కట్టుబడి ఉందని చైర్ పర్సన్ వెల్లడించారు. సమాజానికి మేలు చేయడంలో పోర్టు ఎప్పుడూ ముందుకు ఉంటుందని అన్నారు. స్వచ్చ భారత్ లో విశాఖపట్నం పోర్టు దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచిందని ఇందుకు సహకరించిన పోర్టు ఉద్యోగులను ఆయన ప్రసంసించారు.విశాఖపట్నంలో కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్ధానిక అధికార యంత్రంగంతో కలిసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి కృషి చేస్తున్నట్లు చైర్ పర్సన్ వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో పోర్టు చరిత్రలోనే రికార్డు స్ధాయిలో సరుకు రవాణా చేసినట్లు చైర్ పర్సన్ వెల్లడించారు. ఈ ఏడాది కూడా పోర్టు సరుకు రావణాలో మంచి ప్రతిభ కనబరుస్తోందని తెలిపారు. సామాజిక బాధ్యతలో బాగంగా సమాజ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా దేశ భక్తిని చాటేలా నిర్వహించిన పలు సాంస్కృతి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ద్వారా విఐపి భద్రతకు సంబంధించి నిర్వహించిన మాక్ డ్రిల్, స్నిఫర్ డాగ్ ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఆపరేషన్ సింధూర్ తో దేశభక్తిని ప్రదర్శించేలా చేసిన నృత్య రూపకం అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్బంగా పోర్టులో పనితీరులో విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, పోర్టు భాగస్వాములు, స్టేక్ హోల్డర్ లకు చైర్ పర్సన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేడుకలను విజయవతంగా నిర్వహించిన డిప్యూటీ చైర్ పర్సన్, చీప్ విజిలెన్స్ అధికారి, పోర్టు కార్యదర్సి, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మరియు విభాగాధిపతుల కృషిని చైర్ పర్సన్ ప్రసంసించారు. స్టేక్హోల్డర్లు, ట్రేడ్ పార్టనర్స్ ల నిరంతరం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోర్ట్ అభివృద్ధి కోసం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరింత అంకితభావం, నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ వివరాలను పోర్టు కార్యదర్సి శ్రీ టి వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.****