స్వచ్ఛతా అవార్డ్స్ లో దేశంలోనే విశాఖపట్నం పోర్ట్ కు ప్రథమ స్థానం


విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024 లో దేశంలో మొదటి స్ధానంలో నిలించింది. తద్వారా విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపింది. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన ఈ పోటీలో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ (SMPA) రెండవ స్థానం, ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ (IMU) మూడవ స్థానం పొందాయి. స్వచ్ఛత మరియు పారిశుధ్య కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన విశాఖపట్నం పోర్ట్ ని మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా అభినందించింది.
మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, “స్వచ్ఛత కి భాగీదారీ” మరియు “సంపూర్ణ స్వచ్ఛత” కార్యక్రమాల కింద పోర్ట్ పలు ప్రభావవంతమైన కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో పెద్ద ఎత్తున నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాలు, “ఏక్ పెడ్ మా కే నామ్” మొక్కలు నాటే కార్యక్రమం, గోడలపై చిత్రలేఖనం, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రోత్సహించే సృజనాత్మక పోటీలు ఉన్నాయి.
15 సంవత్సరాలుగా మునిగిపోయి ఉన్న పడవలను తొలగించిన… ఫిషింగ్ హార్బర్లో జరిగిన మెగా క్లీనప్ డ్రైవ్ ఈ కార్యక్రమాలలో విశేషంగా నిలిచింది.
పోర్ట్ వైద్య విభాగం, పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి మిత్ర సురక్ష శివిర్ నిర్వహించింది. ఇందులో వ్యాధి నిరోధక ఆరోగ్య పరీక్షలు, పీపీఈ కిట్ల పంపిణీ, వైద్య సదుపాయాల కల్పన వంటి సేవలు అందించారు. పర్యావరణ సుస్థిరత వైపు బలమైన అడుగులు వేస్తూ, పోర్ట్ విస్తృత స్థాయిలో పచ్చదనం అభివృద్ధి, ల్యాండ్‌స్కేప్ రూపకల్పన చేపట్టి, ASR, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 31,800 మొక్కలు నాటింది.
కంభాలకొండ ఈకో టూరిజం పార్క్‌లో 350 మంది తో ట్రెక్కింగ్ మరియు శుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సమాజంలో ఐక్యతను పెంచడంతో పాటు, పార్క్ పరిసరాలను మరింత అందంగా మార్చింది.
స్వచ్చత లో విశాఖపట్నం పోర్ట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పై పోర్ట్ చైర్మన్ డా ఎం అంగముత్తు, ఐఏఎస్ ఆనందం వ్యక్తం చేసారు. పోర్ట్ సాధించిన ఈ విజయంపై సిబ్బంది, భాగస్వాములను అభినందించారు. , స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాల సాధనలో స్వచ్ఛమైన, పచ్చని మరియు ఆరోగ్యవంతమైన పర్యావరణం కోసం పోర్ట్ కట్టుబడి ఉన్నదని వెల్లడించారు.
పోర్ట్ కార్యదర్శి శ్రీ టి. వేణుగోపాల్ ఈ సమాచారాన్ని ప్రెస్ మరియు మీడియాకు విడుదల చేశారు.















