ఆవిడ ప్రాపర్టీస్ కోసం ఆవిడ ఫైట్ చేస్తుంది షర్మిల #vizagvision #ytshots
-
Next
Visakhapatnam Vizagvision: పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రవచనాలువిశాఖపట్నం Vizag vision:మార్చి 1,2,3 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు విశాఖపట్నంలోని మద్దిలపాలెం “కళాభారతి” ఆడిటోరియంలో పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రవచనాలు నిర్వహించనున్నట్టు కళాభారతి కార్యదర్శి డా. రాంబాబు తెలిపారు. నేటి సమాజంలో భౌతికమైన, ఆర్థికపరమైన పెరుగుదల మనం సహజంగా అయినా ఎన్నో సమస్యలతో మనిషి చూస్తున్నామని, అయి సతమతం అవుతున్నాడన్నారు. దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసికమైన ఎదుగుదల లేకపోవడమేనని, మన సంస్కృతిలో దీనికి చక్కని పరిష్కారం “వేదాంత విద్య” ద్వారా ఋషులు అందించారని, సమాజపరంగా ఎంత ప్రగతిని సాధించినా మానసికమైన ఎదుగుదల, సమతుల్యమైన బుద్ధిబలం ద్వారా మాత్రమే మనిషి ఆనందంగా జీవించగలడన్నారు. ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, ప్రకరణ గ్రంథాల్లో ఆదిశంకరాచార్యులు, తమ ఉపదేశాలతో రమణ మహర్షి వారు అందించారన్నారు. నేటి ఆధునిక జీవన పరిస్థితులను పరిగణిస్తూ, అందరికీ ఆచరణ యోగ్యమైన సాధన రహస్యాలను పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు అందించే ప్రయత్నమే ఈ “సాధన రహస్యం” ప్రవచన కార్యక్రమం అన్నారు. ఇది కేవలం ఒక వయసు వారికి పరిమితం కాదని, ఆలోచన, అవగాహనతో తమ జీవనాన్ని ఆనందమయం చేసుకోవాలనుకునే ప్రతివారికీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.