కాన్సర్ పోరాటానికి పింక్ సఖీ శారీ వాక్ సదస్సు
విశాఖపట్నం 15 ఫిబ్రవరి2025: ఈరోజు స్థానిక ది పార్క్ హోటల్, నెప్ట్యూన్ హాల్ నందు రేపు 16 ఫిబ్రవరి 2025 ఆదివారం బీచ్ రోడ్డులో నిర్వహించు పింక్ సఖి శారీ వాక్ నకు సంబంధించి పత్రికా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు నందు ప్రముఖ సినీనటీ & సామాజిక కార్యకర్త మరియు లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గౌతమి తాడిమళ్ళ పాల్గొని కార్యక్రమం గురించి వివరించారు. ఈ సదస్సు నందు విశాఖపట్నం నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, డా.జి.సాంబశివరావు, శ్రావణ్ షిప్పింగ్ ఎజన్సీస్ మేనేజింగ్ డైరక్టర్, డాక్టర్ డి.ఎస్. ఆనంద్, గురుద్వార సత్ సంగత్ అధ్యక్షులు, డాక్టర్ N.S రాజు, ఏజ్ కేర్ ఫౌండేషన్, డా.SP.రవీంద్ర, ఆల్వారుదాస్ గ్రూపు విద్యా సంస్థలు, కుమారి శిల్పా చక్రవర్తి, సెలబ్రేటి, డాక్టర్ సీత కళ్యాణి, భారతి హాస్పిటల్, డాక్టర్ A.సుగంధి, AS రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్, డాక్టర్ అనంతరామ్ గణపతి, చైర్మన్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, డాక్టర్ మీనాక్షి అనంతరామ్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ (RMT), శ్రీమతి గుర్మీత్ కోహ్లీ, డైరెక్టర్-ప్రాజెక్ట్స్ (RMT) మొదలైన ప్రముఖులు తోపాటు స్పాన్సర్ చేస్తున్న అనేకమంది ఇతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమీషనర్ మాట్లాడుతూ కాన్సర్ పట్ల అవగాహన కలిగించు మన నగరంలో నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమం లో పాల్గొనటం చాల సంతోషంగా ఉంది అన్నారు. క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహ కల్పించే కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు. క్యాన్సర్ అవగాహన కల్పించు ఇలాటి కార్యక్రమాలకు పూర్తీ స్థాయిలో సహాయసహకారాలు అందిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ (RMT) వారు రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఇండియా వారి సహకారంతో ఈ పింక్ సఖి శారీ వాక్ కార్యక్రమాన్ని16 ఫిబ్రవరి, 2025 ఆదివారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ మాసోత్సవం సందర్భంగా మహిళలకు క్యాన్సర్లపై అవగాహన కలిగించుటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పింక్ సఖీ శారీ వాక్ బీచ్ రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుండి వుడా పార్కు వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ వాక్ నకు విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. చివరి నిముషములో ఇంకా ఎవరైనా ఈ వాక్ నందు పాల్గొనాలి అనుకుంటే దయచేసి శ్రీ రఘురామ్ గారిని 9533110061 లేదా శ్రీ వీర్రాజు గారిని 9348623225 సంప్రదించగలరు. ఈ కార్యక్రమానికి మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ఆరోగ్య శాఖ, CMR గ్రూప్, HCG క్యాన్సర్ హాస్పిటల్, ప్రముఖ ఆంకాలజిస్టులు, మరియు అనేక కార్పొరేట్ సంస్థలు మరియు సామాజిక సంస్థలు తమ మద్దతును అందిస్తున్నాయి.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ 16 ఏళ్ల క్రితం స్థాపితమై వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ముఖ్యంగా క్యాన్సర్ అవగాహన, కౌన్సెలింగ్, పాలియేటివ్ మెడికల్ క్లౌనింగ్ రంగాలలో సామాజిక అభ్యున్నతి మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాది. ఇతర కంపెనీలు మరియు సంస్థలు ముందుకు రావాలని తమ వంతు మద్దతును అందించాలని ట్రస్టు కోరుచున్నాది.
