VIZAGVISION:Bus Crashed into Public Breaks failed APSRTC two Dead,Vijayawada..వాంబే కాలనీ నుండి Rtc బస్టాండ్ వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావటంతో జనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు. మూడు బైకులు ద్వ0సం..బుడమేరు వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు గన్నవరం వాంబే కాలనీ నుంచి బస్టాండ్ వెళ్తోంది. బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలై బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఓ ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.